TS SI Constable Results 2023 Updates: తెలంగాణలో పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 57, 58లపై పలువురు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారించిన ధర్మాసనం… కీలక ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.