Singapore Arrest: అది సింగపూర్ ఎయిర్ పోర్టు. చాలా బిజీగా ఉంది. ఓ మహిళ అప్పుడే విమానం దిగి బయటకు వెళ్లేందుకు సిద్ధమయింది. కానీ ఇంతలోనే ఆమెను పోలీసులు చుట్టు ముట్టారు. అదుపులోకి తీసుకున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. అంత సీరియస్ గా అరెస్టు చేశారంటే ఖచ్చితంగా ఆమె ఏ అంతర్జాతీయ టెర్రరిస్టో లేకపోతే డ్రగ్స్ స్మగ్లరో అయి ఉంటుందని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరు.
రెండేళ్ల కిందట ఎయిర్ పోర్టులో సెంట్ బాటిల్ కొట్టేసి వెళ్లిపోయిన మహిళ
ఆమెను అరెస్టు చేసింది 250 డాలర్ల విలువై ఓ పర్ఫ్యూమ్ ను దొంగతం చేసిన కేసులో. అది కూడా ఇప్పుడు కాదు..రెండేళ్ల కిందట.
రెండేళ్ కిందట రాజ్ వర్ష అనే ఆస్ట్రేలియా మహిళ సింగపూర్ టూర్ కు వచ్చారు. తిరిగి ఆస్ట్రేలియా వెళ్లే సమయంలో చాంగి ఎయిర్ పోర్టులో ప్లయిట్ క సమయం ఉందని డ్యూటీ ఫ్రీ షాపులో షాపింగ్ కు వెళ్లారు.అక్కడ ఆమె ఓ 250 డాలర్ల విలువైన ఓ సెంట్ బాటిల్ ను తీసుకుని బ్యాగులో వేసుకున్నారు. బిల్లు చెల్లించకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
మహిళ విమానం ఎక్కిన తర్వాత గుర్తించిన పోలీసులు – రికార్డుల్లో నమోదు
మార్చి 23, 2023న చాంగి విమానాశ్రయం టెర్మినల్ 1 డిపార్చర్ ట్రాన్సిట్ ప్రాంతంలోని ది షిల్లా డ్యూటీ ఫ్రీ పెర్ఫ్యూమ్ మరియు కాస్మెటిక్స్
షాప్ నుండి దొంగిలిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వస్తువు కనిపించకుండా పోయిన తర్వాత దుకాణదారులు అప్రమత్తమయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ విషయాన్ని తమ రికార్డులకు ఎక్కించుకున్నారు. కానీ అప్పటికే ఆమె సింగపూర్ దాటి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది.
రెండేళ్ల తర్వతా మళ్లీ సింగపూర్ వచ్చిన మహిళ
మళ్లీ ఆమె సింగపూర్ ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు పోలీసులు. ఆమె ఎప్పుడు వచ్చినా అలర్ట్ పోలీసులకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె తిరిగి వస్తుందో రాదో ఎవరికీ తెలియదు కానీ రెండేళ్ల తర్వాత రాజ్ వర్షిణి మళ్లీ సింగపూర్ వచ్చారు. ఆమెకు తాను సెంట్ బాటిల్ ను కొట్టేసిన విషయం గుర్తుందో లేదో కానీ ఆమె పాస్ పోర్టును అలా స్కాన్ చేయగానే అలా పోలీసులకు సమాచారం వెళ్లిపోయింది. వారు చక్కగా వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్ పోర్టులో దిగగానే అరెస్టు
తాను రెండేళ్ల కిందట చేసిన దొంగతనంలో ఇప్పుడు పట్టుకోవడంతో రాజ్ షాక్ కుగరయ్యారు. ఏప్రిల్ 4న ఆమె పై దొంగతనం నేరం మోపారు. దీనికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానా విధించే అవకాశం ఉంది. మళ్లీ సింగపూర్ రాకపోయినా బాగుండేదని ఇప్పుడు ఆమె అనుకుంటూ ఉండవచ్చు. కానీ చేసేదేమీ లేదు.
మరిన్ని చూడండి