Smallest Spark Can Ignite Unrest PM Narendra Modi Narrates What Led To 2002 Gujarat Riots

PM Modi : ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే మార్గం యుద్ధ భూమి ద్వారా కాకుండా చర్చల ద్వారా సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆదివారం అమెరికాకు చెందిన ప్రముఖ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రసారం అయిన ఈ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, శాంతి చర్చలు, గ్లోబల్ పాలిటిక్స్ వంటి అంశాల మీద ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్, రష్యా దేశాలు చర్చలకు రావాలని ఆయన  సూచించారు. ఉక్రెయిన్‌ శాంతి కోసం అది మిత్రదేశాలతో ఎన్ని చర్చలు నిర్వహించినా ప్రయోజనం ఉండదు. శాంతి కావాలంటే ఉక్రెయిన్  రష్యా దేశాలు ఒకే టేబుల్ వద్ద కూర్చొని చర్చించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

గుజరాత్ అల్లర్ల విషాదం
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై మాట్లాడుతూ.. గోద్రా హింస ఊహించని విషాదం అని, కొందర్ని సజీవ దహనం చేశారని ప్రధాని అన్నారు. ఇవి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లు అనే అభిప్రాయం తప్పుడు సమాచారం అని అన్నారు. 2002 కి ముందు గుజరాత్‌లో 250 కి పైగా ముఖ్యమైన అల్లర్లు జరిగాయని ఆయన అన్నారు. “ఫిబ్రవరి 24, 2002న, నేను మొదటిసారిగా రాష్ట్ర ప్రతినిధి అయ్యాను. ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన నేను ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో మొదటిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాను. ఫిబ్రవరి 27, 2002న బడ్జెట్ సమావేశాల కోసం మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు… అకస్మాత్తుగా, భయంకరమైన గోద్రా సంఘటన జరిగింది. ఇది ఊహించలేని స్థాయిలో విషాదం, ప్రజలను సజీవ దహనం చేశారు” అని ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్‌లో అన్నారు.

మహాత్ములు పుట్టిన నేల
భారతదేశం బుద్ధుడు, మహాత్మాగాంధీ  పుట్టిన నేల అని, ఆ కారణంగానే భారతదేశ శాంతి సందేశం ప్రపంచదేశాల్లో ప్రతిధ్వనిస్తోందని  ప్రధాని మోదీ అన్నారు.భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని..ప్రజాజీవితంలో తన ప్రయాణం, చిన్ననాటి విషయాలు, ఆర్ఎస్ఎస్‌తో ఉన్న తన అనుబంధం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మిత్రత్వం సహా పలు విషయాలకు సమాధానం ఇచ్చారు. ‘‘ నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల మంది ప్రజలు, దేశ సంస్కృతి, వారసత్వం నా వెనుక ఉండడమే నా బలం” అని మోదీ అన్నారు.  

ఆర్ఎస్ఎస్ తో అనుబంధం
ఆర్ఎస్ఎస్ తో అనుబంధం, అక్కడ నేర్చుకున్న విలువలే తన సైద్ధాంతిక పునాదులని ప్రధాని స్పష్టం చేశారు. దేశం కన్నా మిన్న ఏదీ లేదన్నారు. సమాజ సేవే దైవ సేవ అని ఆర్ఎస్ఎస్ నుంచి తాను నేర్చుకున్నట్లు తెలిపారు. దేశ సేవలో ఆర్ఎస్ఎస్ కంట్రిబ్యూషన్ ఎంతో ఉందన్నారు. విద్యాభారతి పేరుతో దేశవ్యాప్తంగా 70వేల పాఠశాలలు నడుపుతోందన్నారు. 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందని తెలిపారు.  అలాగే ఉగ్రవాదం అనేది ఇండియా సమస్య మాత్రమే కాదన్నారు. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అని మోదీ అన్నారు.  భారత్‌తో పాక్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందన్నారు. అదే సమయంలో టెర్రరిజాన్ని ఇండియాకు ఎగుమతి చేస్తోందని మోదీ తప్పుపట్టారు. 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link