Sobhita Dhulipala Gives beauty tips అక్కినేని కొత్త కోడలు బ్యూటీ టిప్స్

అక్కినేని వారి కొత్త కోడలు శోభిత దూళిపాళ్ల ఇస్తున్న బ్యూటీ టిప్స్ నిజంగా అమ్మాయిలకు చాలా అవసరం. అమ్మాయిలు మేకప్స్ వేసుకుని ఫేస్ ని పాడుచేసుకుంటూ ఉంటారు. రకరకాల కాస్మొటిక్స్ ట్రై చెయ్యాలి, హీరోయిన్స్ మాదిరి ఉండాలి, హీరోయిన్స్ లా హెయిర్ స్టయిల్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి మేకప్ వేసుకున్నా దానిని స్మూత్ గా తొలగించదానికి ఆయిల్ అప్లై చేయమంటుంది శోభిత. తాను షూటింగ్ అవ్వగానే ఫేస్ కి ఉన్న మేకప్ తొలగించి వేడి నీటితో స్నానం చేస్తాను, రిలాక్స్ అవడానికి బుక్స్ చదువుతాను అంటుంది.

అంతేకాదు తన హెయిర్ అంత బాగా పొడవుగా ఉండడానికి ప్రధాన కారణం తాను ఎక్కువగా ఆయిల్ ఆపై చేస్తుందట. కొబ్బరి నూనెను  హెయిర్ కి ఎక్కువగా పెట్టుకుంటాను, మా అమ్మ చేత ఆయిల్ తో మర్దన చేయించుకుంటాను, నా హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది, సినిమాల కోసం దానిని కట్ చేశాను అంటూ చెప్పుకొస్తుంది.

ఇక తన కనుబొమ్మలు అలా చక్కటి షేప్ లో ఉండడానికి తాను ఆముదం కనుబొమ్మలపై అప్లై చేస్తుందట. పగలు షూటింగ్స్ తో బిజీగా వున్నా నైట్ మాత్రం తన ఫేస్ పై పసుపు, పాలు, సెనగపిండి, లేదంటేఏదైనా ఫ్రూట్ ని ఫేస్ మాస్క్ వేసుకుంటుందట. ఫిట్ గా ఉండేందుకు యోగ, జిమ్ చేస్తుందట.

తన మొహం లో గ్లో కోసం, ఇంకా ఆరోగ్యం కోసం ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి అంటూ శోభిత అక్కినేని బ్యూటీ టిప్స్ షేర్ చేసింది. 

Source link