ByGanesh
Fri 07th Feb 2025 09:39 AM
సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య రీసెంట్‌గా నటి శోభితా ధూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో చైతన్య గడ్డంతోనే కనిపించాడు. తండేల్ సినిమా కోసం గడ్డంతోనే ఉన్న చైతన్య.. ఆ సినిమా పూర్తయ్యి, రిలీజ్ అయిన సందర్భంగా క్లీన్ షేవ్‌లోకి మారాడు. తండేల్ సినిమా విడుదల వేళ చైతూ సతీమణి శోభితా ధూళిపాల ఈ గడ్డంపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. తండేల్ విడుదల సందర్భంగా భార్యాభర్తలిద్దరూ ఇన్‌స్టాలో కాసేపు చిట్ చాట్ చేశారు.
ఈ చిట్ చాట్‌లో తండేల్ చిత్రీకరణ సమయంలో ఎంత పోకస్డ్‌గా, ఎంత పాజిటివ్‌గా ఉన్నారో దగ్గరగా చూశాను. ఈ అసాధారణమైన ప్రేమకథను థియేటర్లలో చూసేందుకు ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని శోభితా ధూళిపాల పోస్ట్ చేసింది. అలాగే క్లీన్ షేవ్ గురించి ప్రస్తావిస్తూ.. ఫైనల్లీ ఆ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ఫేస్ దర్శనమవుతుంది సామి అని చైతూని ట్యాగ్ చేయగా.. థ్యాంక్యూ మై బుజ్జి తల్లి అంటూ చైతూ స్మార్ట్‌గా పడేశాడు. వీరిద్దరి ఈ ఛాట్ వైరల్ అవుతోంది.
ఇంతకు ముందు వైజాగ్ ఈవెంట్‌లో చైతూ మాట్లాడుతూ.. నేను విశాఖ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. మా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ కాబట్టి.. మీరు కచ్చితంగా ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయాలి.. లేదంటే పరువుపోతుంది అంటూ సరదాగా సంభాషించిన విషయం తెలిసిందే. అలాగే తన భార్యతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా చైతూ ఓ వేడుకలో తెలిపారు. ఇక చైతూ కోరిక మేరకు వైజాగ్ అనే కాదు.. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.
Sobhita Dhulipala on Thandel Movie:
Sobhita Dhulipala and Chaitu Heartfelt Exchange on Thandel Release Sparks Viral Buzz