Sold land spent Rs 1 Croe stayed in US for 9 days | Deportation Stories: చావునోట్ల తల పెట్టి .. కోటి ఖర్చు పెట్టి అమెరికా వెళ్లాడు

Sold land spent Rs 1 Croe stayed in US for 9 days: అమెరికాలో ఇల్లీగల్ గా ప్రవేశించిన వారిని .. ఎలాంటి పత్రాలు లేని వారిని అమెరికా వారి వారి దేశాలకు డిపోర్ట్ చేస్తోంది. భారతీయుల్ని కూడా ఆర్మీ విమానంలో పంపింది. పంజాబ్, హర్యానాకు చెందిన వారు ఆ విమానాల్లో ఎక్కువగా ఉన్నారు. చాలా మంది తమ వివరాలను బయట పెట్టలేదు కానీ.. హర్యానాకు చెందిన ఓ యువకుడి కుటుబం మాత్రం తమ ఆవేదనను మీడియా ముందు ఆవిష్కరించింది.  

ఇరవై ఏళ్ల ఆకాష్ అనే కుర్రాడ్ని కూడా అమెరికా మిలటరీ అధికారులు తీసుకు వచ్చి వదిలి పెట్టారు. ఆకాష్ తండ్రి ఎప్పుడో చనిపోవడంతో అతని సోదరులే పెంచి పెద్ద చేశారు. అమెరికా వెళ్లి బాగుపడాలన్నది ఆ కుర్రాడి కల. కానీ నేరుగా వెళ్లడం సాధ్యం కాలేదు. కానీ అడ్డదారుల్లో తీసుకెళ్తామని చెప్పే ఏజెంట్లను నమ్మారు. హర్యానాలోని తమ భూములను కూడా అమ్మి ఏజెంట్లకు చెల్లించారు. వారు డబ్బులు తీసుకుని తమ బాధ్యతను నిర్వర్తించారు. నేరుగా మెక్సికోకు తీసుకెళ్లి అక్కడ్నుచి అమెరికా బోర్డర్ లో గోడ దూకేలా చేశారు. తమ పని అయిపోయిందనిపించారు. అయితే ఆ కుర్రాడు అలా గోడ దూకిన వెంటనే తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో అక్కడి పోలీసులు పట్టుకుని డిటెన్షన్ సెంటర్ లో పెట్టారు.                              

ఏదో ఓ బాండ్ మీ సైన్ చేయించుకుని ఆకాష్ ను అక్కడే ఉండేలా చేస్తారని అనుకున్నామని ఆకాష్ సోదరులు బావురుమన్నారు. కోటి రూపాయలు ఖర్చు పెట్టినా తొమ్మిది రోజుల్లోనే తమ సోదరుడ్ని వెనక్కి పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్లు ఇల్లీగల్ గా..సేఫ్ గా తీసుకు వెళ్తామని చెప్పి తీసుకెళ్లారు కానీ.. అత్యంత క్లిష్టమైన దారిలో.. అడుగడుగునా చావు కనిపించే రూట్లలో తీసుకెళ్లారని.. అంటున్నారు. ఆ వీడియోలను కూడా ఆకాష్ ఎప్పటికప్పుడు పంపేవాడు. సరిహద్దుల వద్ద భద్రతను కఠినం చేయడంతో.. ఇలా అడవుల గుండా తీసుకెళ్లి..అమెరికా చేర్చారు. సురక్షితంగా అమెరికా భూభాగంలో ప్రవేశించినా అక్కడ వెంటనే దొరికిపోవడంతో ఆకాష్ కు గుడ్డ పరిస్థితి ఎదురయింది. 

నిజానికి ఇలా అక్రమంగా వలస వచ్చిన వారందరికీ ట్రంప్ వచ్చే ముందు వరకూ డిటెన్షన్ సెంటర్లలో ఉంచేవారు. తర్వాత వారికి ఏదో ఓ వీసా సౌకర్యం కల్పించి అక్కడే పని చేసుకునే అవకాశం ఇచ్చేవారు. ట్రంప్ వచ్చిన తర్వాత డిటెన్షన్ సెంటర్లలో ఉన్న వారందర్నీ డిపోర్ట్ చేస్తున్నారు. మెక్సికో .. కెనడా సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో అక్కడ్నుచి అంటే డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడం కష్టంగా మారింది. అలా వెళ్లిన వాళ్లు లోపల ఉండటం కూడా కనాకష్టంగా మారింది.

Also Read: ముఖానికి కవర్ చుట్టి నైట్రోజన్ గ్యాస్ పంపి చంపేశారు – హత్య కాదు ఉరిశిక్ష- అమెరికాలో అంతే !

మరిన్ని చూడండి

Source link