54.30 అడుగులుగా నీటిమట్టం…
మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వరద కొనసాగుతోంది. 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. శుక్రవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో… ఇవాళ వరద ప్రవాహం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ఎగువ భాగాన నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 14.30 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా డెల్టా పంట కాల్వలకు 4వేల క్యూసెక్కులు నీటిని, సముద్రంలోకి 13.57 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఇక భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటి మట్టం 54.30 అడుగులుగా ఉంది. 14,92,679 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం అమలులో ఉంది.