ByGanesh
Sun 23rd Feb 2025 10:25 AM
రాజమౌళి ఎపుడైనా తన కొత్త చిత్రం స్టార్ట్ చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే ఓపెనింగ్ రోజు ప్రత్యేకంగా మీడియా మీట్ లో ఆ సినిమాకు సంబందించిన వివరాలను మీడియా తో పంచుకోవడమే చేస్తారు. కానీ సూపర్ స్టార్ మహేష్ తో చెయ్యబోయే చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ కానీ, ఓపెనింగ్ రోజు మీడియాను పిలవడం కానీ ఏమి చెయ్యకుండా అన్ని సీక్రెట్ గా కానిచ్చేశారు.
దానితో రాజమౌళి-మహేష్ కాంబో విషయంలో ఆత్రుత ఎక్కువైపోతోంది. రాజమౌళి ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 అని మీడియా కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది. తాజాగా రాజమౌళి-మహేష్ మూవీకి సంబందించిన మీడియా మీట్ ముహూర్తం కుదిరింది అనే వార్త వైరల్ గా మారింది. SSMB29 మూవీపై రాజమౌళి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
మరి ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు అనేది వివరాలు తెలియకపోయినా మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా జాతీయ మీడియా కూడా చాలా ఎగ్జైట్ అవుతూ వెయిట్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లోబ్ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. అంతేకాకుండా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
SSMB 29 Sensational Press Meet Coming Up:
SSMB 29 shooting silently SS Rajamouli press meet soon