SSMB29 heroine enjoys brother wedding సోదరుడి పెళ్ళిలో SSMB29 హీరోయిన్ సందడి


Thu 06th Feb 2025 10:02 AM

priyanka chopra  సోదరుడి పెళ్ళిలో SSMB29 హీరోయిన్ సందడి


SSMB29 heroine enjoys brother wedding సోదరుడి పెళ్ళిలో SSMB29 హీరోయిన్ సందడి

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మహేష్ బాబు-రాజమౌళి కలయికలో మొదలైన SSMB 29 చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుంది. యూనిట్ నుంచి అధికారిక సమాచారం రాకపోయినా ప్రియాంక చోప్రా మహేష్-రాజమౌళి కాంబో మూవీలో నటిస్తుంది ఇది ఫిక్స్. 

తాజాగా SSMB 29 షూటింగ్ కి బ్రేకిచ్చి ప్రియాంక చోప్రా ముంబై వెళ్ళింది. అక్కడ సోదరుడు సిద్దార్థ్ చోప్రా పెళ్లి వేడుకల్లో సందడి చేస్తుంది. నిన్న బుధవారం సిద్దార్థ్ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. హల్దీ వేడుక లో ప్రియాంక చోప్రా కజిన్స్ తో కలిసి చాలా సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. 

ఒకప్పుడు సౌత్ మీడియాలో అంతగా వినిపించని ప్రియాంక చోప్రా పేరు ఇప్పుడు SSMB 29 లో నటిస్తుంది అనగానే సౌత్ మీడియా ఫోకస్ మొత్తం ప్రియాంక చోప్రా కదలికలపై కన్నేసింది. ఇక సోదరుడి వివాహమవ్వగానే ప్రియాంక చోప్రా తిరిగి హైదరాబాద్ రానుంది. 


SSMB29 heroine enjoys brother wedding:

Priyanka Chopra Enjoys Brother Wedding Festivities With Family





Source link