Staff Selection Commission Has Released Multi-Tasking Staff, And Havaldar Examination, 2023 Notification, Details Here

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

పోస్టుల వివరాలు..

✪ మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నిక‌ల్‌) స్టాఫ్ ఎగ్జామినేషన్-2023

మొత్తం ఖాళీల సంఖ్య: 1,558.

1) మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 1198 పోస్టులు

2) హవాల్దార్ (సీబీఐసీ, సీబీఎన్): 360 పోస్టులు 

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత.

వయోపరిమితి: 01.08.2023 నాటికి 18-25 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.08.1998 – 01.08.2005 మధ్య జన్మించి ఉండాలి. కొన్ని పోస్టులకు 18-27 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.08.1996 – 01.08.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

కరెక్షన్ ఫీజు: దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మొదటిసారి రూ.200, రెండోసారి అయితే  రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తుల సమయంలో పొరపాట్లు లేకుండా వివరాలు నమోదచేయడం మంచిది.

పరీక్ష విధానం..

✦ మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.  120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.   

✦ రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.

✦ పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25%, ఇతరులకు-20%  గా నిర్ణయించారు.

✦ మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

✦ హవిల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.06.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.07.2023 (23.00).

➥ ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 22.07.2023 (23.00).

➥ ఆఫ్‌లైన్ చలనా జనరేట్ చేసుకోవడానికి చివరితేది: 23.07.2023 (23.00).

➥ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 24.07.2023.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 26.07.2023 – 28.07.2023 (23:00)

➥ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: సెప్టెంబరు, 2023.

Notification

Online Application

MTS Posts Details

Also Read:

రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 140 ఖాళీలు, అర్హతలివే!
చెన్నైలోని నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని ‘రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌’ వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link