Staff Selection Commission Has Released Notification For Constable (Executive) Male And Female Posts In Delhi Police Examination 2023, Details Here | Constable Recruitment: 7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు

1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.

2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలలి. అభ్యర్థులు 02.07.1998 – 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు 5 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌(ఎస్సీ, ఎస్టీ)లకు 10 సంవత్సరాలు, ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు- 40 నుంచి 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఇతర అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.   

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: రూ.21,700 – రూ.69,100.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌-50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ-15 ప్రశ్నలు-15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం. 

ముఖ్యమైన తేదీలు…

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2023 నుంచి 30.09.2023 వరకు

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 30.09.2023.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.09.2023.

➥ దరఖాస్తుల సవరణ తేదీలు: 03, 04.10.2023 తేదీల్లో

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్‌లో.

Notification

Website

ALSO READ:

6 వేలకు పైగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌, స్టైఫండ్‌ ఎంతంటే?
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

రాజమండ్రి- ఏపీ సివిల్ సప్లయ్ విభాగంలో 717 ఖాళీలు, వివరాలు ఇలా!
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 717 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link