Subrahmanya Leading Vishwambhara విశ్వంభరను తలపిస్తోన్న సుబ్రహ్మణ్య


Sat 31st Aug 2024 07:56 PM

subrahmanya,vishwambhara  విశ్వంభరను తలపిస్తోన్న సుబ్రహ్మణ్య


Subrahmanya Leading Vishwambhara విశ్వంభరను తలపిస్తోన్న సుబ్రహ్మణ్య

మెగాస్టార్ చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ని వదిలిన విషయం తెలిసిందే. ఇప్పుడా పోస్టర్‌ని తలపించేలా.. మరో ఫాంటసీ సినిమా పోస్టర్ ఉండటం సోషల్ మీడియాలో చర్చలకు తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాని పోలిన పోస్టర్ అంటే ఆ మాత్రం హడావుడి ఉంటుందిగా.

నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ సెకెండ్ టైమ్ మెగాఫోన్ పట్టారు. ఈసారి తన కుమారుడు అద్వయ్‌ని ఆయన హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాకు సుబ్రహ్మణ్య అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. ప్రీ లుక్ పోస్టర్‌ని శనివారం విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్.. సేమ్ టు సేమ్ విశ్వంభర‌ను తలపిస్తుండం విశేషం. ఈ రెండు సినిమాలు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ జానర్‌ కావడం వల్ల అలా అనిపిస్తుందా? లేదంటే దాదాపు సేమ్ స్టోరీనా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

సుబ్రహ్మణ్య విషయానికి వస్తే.. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఈ బ్యానర్‌ నుంచి వచ్చిన గుణ369 విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగా నిలిచింది. సుబ్రహ్మణ్య సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


Subrahmanya Leading Vishwambhara:

Subrahmanya Pre Look Poster Released





Source link