Sunita Williams and Wilmore Return to Earth on march 19 morning

Sunitha And Wilmore Latest News: 9నెలల సుదీర్ఘ నిరీక్షణకు తర్వాతలోనే తెరపడనుంది. సునీతమ్మ భూమిపైకి తిరిగి అడుగుపెట్టే తరుణం రానే వచ్చింది. తొమ్మిది నెలలుగా అంతరిక్షాన్ని తన నివాసంగా మార్చుకుని ప్రయోగాలు చేస్తూ చరిత్ర సృష్టించిన సునీత బృందం ఎప్పుడెప్పుడు భూమిపైకి వస్తుందా అని ఎదురు చూశారు. కోట్లమంది సునీతా విలియమ్స్‌ కోసం ప్రార్థనలు చేశారు. త్వరగా రావాలని అన్ని దేవుళ్లను వేడుకున్నారు. 

షెడ్యూల్ రిలీజ్ చేసిన నాసా అండ్‌ స్పేస్‌ఎక్స్‌

అందరి ఆకాంక్షలు, ప్రార్థనలు ఫలించాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్‌ రిటర్న్ జర్నీకి పర్మిషన్ వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు వచ్చేందుకు డేట్‌ను టైంను నాసా ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్‌ఎక్స్ ప్రకటించేశాయి.

భూమి మీదకు రానున్న నలుగురు టీం 

సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్‌తోపాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కూడా భూమ్మీదకు వస్తున్నారు. మరో ఇద్దరి పేర్లు నిక్ హేగ్, రష్యా కాస్మానాట్ అలెగ్జాండర్ గోర్భునోవ్. ఈ టీమ్‌ను క్రూ9 అని పిలుస్తారు. ఇప్పుడు కొత్తగా అంతరిక్షంలోకి వెళ్లిన వారిని క్రూ 10గా చెబుతారు. వాళ్లు కూడా నలుగురే. క్రూ 10 వెళ్లిన స్పేస్‌ వెహికల్‌లోనే సునీతా విలియమ్స్‌ అండ్‌ టీం అంటే క్రూ 9 భూమి మీదకు రానున్నారు. 

మార్చి 19న సునీతా విలియ్స్‌ అండ్‌ టీం ల్యాండిగ్‌ 

భారత కాలమానం ప్రకారం మార్చి 18 మంగళవారం ఉదయం 8.15 నిమిషాలకు సునీతా విలియమ్స్ టీమ్‌ భూమ్మీదకు దిగే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీనికి చాలాప్రోసెస్ ఉంటుంది. ఆ ప్రోసెస్ చాలా సమయం పడుతుంది. వీళ్లు ఉదయం 8.15 గంటలకు అంతరిక్షం నుంచి బయల్దేరతారు. అక్కడి నుంచి వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. మార్చి 19 బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య ల్యాండ్ అవుతారు. ఫ్లోరిడా సముద్ర తీరంలో స్ప్లాష్ డౌన్ అవుతారు. అక్కడి నుంచి వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా సిబ్బంది, ఇతర సహాయకులు ఉంటారు. 

వెంటనే నాసా సెంటర్‌కు తరలింపు 

సునీతా విలియమ్స్‌ ప్రయాణించే వెహికల్‌ ల్యాండ్ అయిందో లేదో వెంటనే నాసా టెక్నీషియన్స్ స్విమ్మర్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను క్యాప్సూల్ నుంచి బయటకు తీస్తారు. వారిని సురక్షితంగా నాసా సెంటర్‌కు తరలిస్తారు. అంటే బుధవారం వేకువ జామున సునీతా మరోసారి భూమిపైకి రానున్నారు. ఈ అద్భుతఘట్టం కోసం కోట్ల మంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link