Supreme Court dismissed pleas challenging insertion of terms Socialist and Secular in Preamble to Indian Constitution

Supreme Court Junks Pleas Against Insertion Of ‘Socialist’ And ‘Secular’ In Preamble | న్యూఢిల్లీ: అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం భారత్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ భారత్ ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవేశికలో ఆ రెండు పదాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారణ చేపట్టింది. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకిక, సామ్యవాద అనే పదాలు తొలగించాలన్న పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. 

మరిన్ని చూడండి

Source link