New Delhi: న్యూఢిల్లీ 2 ఏప్రిల్ 2024: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ వ్యతిరేకించకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్ ఈ కేసుపై మాట్లాడొద్దని ఆదేశించింది. దీంతోపాటు మరికొన్ని షరతులు పెట్టింది.
అక్టోబర్ నాలుగున ఈ కేసులో సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వివిధ కోర్టుల్లో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు బెయిల్ అప్లికేషన్లు పెడుతూ వచ్చారు. చివరకు సుప్రీం కోర్టులో ఆయన బెయిల్ లబించించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంజయ్ సింగ్ కీలక వ్యక్తి అని ఈడీ వాదించింది. బెయిల్ అప్లికేషన్ వచ్చిన ప్రతిసారి అబ్జెక్ట్ చేస్తూ వచ్చింది. సుప్రీంకోర్టులో వాదనల సమయంలో మాత్రం బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పలేదు.
మరిన్ని చూడండి