Tamil Nadu Man Ordered to Pay Alimony to Wife Shows Up With Rs 80,000 in Coins | Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు

Tamil Nadu Man Ordered to Pay Alimony to Wife Shows Up With Rs 80,000 in Coins: భార్య, భర్తల మధ్య విబేధాలు రావడం సహజం. అయితే గతంలో పెద్దల వద్దనో.. కౌన్సెలింగ్ సెంటర్ లోనే రాజీపడిపోయేవారు. కానీ ఇప్పుడు మహిళల్లో చైతన్యం పెరిగింది. విడిపోతే భర్తతో ఉండాల్సిన అవసరం లేదు. పైగా మనోవర్తి కూడా వస్తుందన్న ఉద్దేశంతో న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కొన్ని కేసులు వైరల్ గా మారుతున్నాయి. 

తాజాగా కోయంబత్తూరులో ఓ ఫ్యామిలీ కోర్టులో ఓ వ్యక్తి రూ. 80వేల రూపాయల విలువైన చిల్లరతో కోర్టుకు వచ్చారు. అందరూ ఏమిటా అనుకున్నారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రకారం తన భార్యకు మనోవర్తి చెల్లించడానికి తెచ్చానని చెప్పి కోర్టులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యక్తి చర్య ఒక్క సారిగా వైరల్ గా మారింది. 

Also Read: పెళ్లయిన 43 ఏళ్లకు రూ.3 కోట్లు భరణం ఇచ్చి మరీ భార్యకు విడాకులు – పాపం ఈ పెద్దాయన ఎంత టార్చర్ అనుభవించారో ?

వడవెల్లి ప్రాంతానికి చెందిన కాల్ టాక్సి డ్రైవర్ ఒకరికి కొన్నాళ్ల కిందట పెళ్లి అయింది. ఆయనకు భార్యతో సరిపడలేదు. ఆ భార్య కోర్టుకెళ్లింది. విచారణ జరిపిన న్యాయస్థానం భార్యకు రెండు లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. అందులో ముందుగా ఎనభై వేల రూపాయలు కట్టాలని ఆదేశించింది. తాను కాల్ టాక్సీ డ్రైవర్నని అంత మొత్తం కట్టలేనని ఆయన వాదించారు. అయితే చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆయన వాదన నెగ్గలేదు. 

Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త – ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !

మధ్యంతరంగా .. మనోవర్తి కింద ఆమెకు రూ. 80వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తన దగ్గర డబ్బులు లేవన్న విషయాన్ని సింబాలిక్ గా చెప్పాలనుకున్నాడు అ భర్త. అలాగని కట్టకపోతే జైలుకు వెళ్తాడు. అందుకే కాయిన్స్ తీసుకుని వచ్చాడు. కోర్టులో డిపాజిట్ చేశాడు. అయితే న్యాయస్థానం మాత్రం..  నోట్స్ తీసుకొచ్చి డిపాజిట్ చేయాలని చెప్పి వెనక్కి ఇచ్చేసింది. 

ఇటీవల అతుల్ సుభాష్ అనే టెకీ ఇలా భార్య వేసిన కేసులు, ఆరోపణల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ డ్రైవర్ చేసిన చర్య కూడా వైరల్ గా మారింది.                            

 

మరిన్ని చూడండి

Source link