ByGanesh
Fri 31st Jan 2025 07:50 PM
నాగ చైతన్య-సాయి పల్లవిల తండేల్ రాబోతుంది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న తండేల్ ప్రమోషన్స్ నిన్నమొన్నటివరకు చెప్పగానే కనిపించినా ఇపుడు తండేల్ స్పీడు మాములుగా లేదు. చెన్నై నుంచి ముంబై వరకు తండేల్ టీమ్ సందడే కనబడుతుంది. వైజాగ్ లో తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య, అల్లు అరవింద్ మాత్రమే కనిపించారు.
కానీ చెన్నై స్పెషల్ ఫ్లైట్ లో చందు మొండేటి, సాయి పల్లవి, అల్లు అరవింద్, నాగ చైతన్య కలిసి అక్కడ కార్తీ తమిళ ట్రైలర్ లాంచ్ చెయ్యడం..ఆ నెక్స్ట్ డే అంటే ఈరోజు ముంబైలో అమీర్ ఖాన్ చేతుల మీదుగా తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ ఇలా పాన్ ఇండియా హడావిడి ఓ రేంజ్ లో కనిపిస్తుంది.
ఇటు పుష్ప 2 తో పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ గెస్ట్ గా తండేల్ ప్రీ రిలీజ్ అనౌన్సమెంట్ వచ్చేసింది. హైదరాబాద్ ఈవెంట్ కి మేకర్స్ శ్రీకారం చుట్టారు. ప్రమోషన్స్ లేట్ అయినా లేటెస్ట్ గా చుట్టెయ్యడంతో తండేల్ ఆడియన్స్ కు బాగానే రీచ్ అవుతుంది.
Tandel speed is not normal:
Full Swing in Thandel Promotions