TCS manager Manav Sharma dies by suicide after wife alleged harassment | Another Atul Subhash case: ఆగ్రాలో మరో అతుల్ సుభాష్ – టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య

TCS manager suicide: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్ శర్మ అనే పాతికేళ్ల యువకుడు అగ్రాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మానవ్ శర్మ ఫిబ్రవరి 24న ఉదయం ఆగ్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. భార్య వేధింపుల కారణంగానే ఆ యువకుడు చనిపోయాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు శివరాత్రి వేడుకల పేరుతో ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మానవ్ శర్మ బంధువులు సీఎం పోర్టల్ కు ఫిర్యాదు చేశారు. 

మానవ్ శర్మ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడయో రికార్డు చేసుకున్నారు. ఆ వీడియోను  మానవ్ ఫోన్ లో కుటుంబసభ్యులు గమనించారు. అందులో తన భార్య తనను తీవ్రంగా వేధిస్తోందని.. తట్టుకోలేకపోతున్నానని వీడియోలో చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణం భార్యేనన స్పష్టంచేశాడు.  ” మగవాళ్ల గురించి ఆలోచించండి మాట్లాడండి” అని ప్రజలను వేడుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు క్షమాపణలు కూడా చెప్పాడు.

మెడకు ఉరి వేసుకుని  శర్మ తన చివరి వీడియోను రికార్డ్ చేశాడు. పోలీసులను ఉద్దేశించి కొన్ని కామెంట్లస్ చేశారు.  చట్టం  మగవాళ్లను రక్షించాలి, లేకుంటే మగవాళ్లు లేని సమయం వస్తుందన్నారు. తన భార్య వేరొకరితే ఇతరులతో వివాహేతర బంధం పెట్టుకుందని  రివర్స్ లో తనను టార్చర్ చేస్తోందని మానవ్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో  ఈ వీడియో వైరల్ గా మారింది.  

బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ కూడా ఇలాంటి ఆరోపణలు భార్యపై చేసి ప్రాణం తీసుకున్నాడు. తన భార్య వేధిస్తోందని అన్నాడు. అ సమయంలో బార్యా వేధింపులకు గురవుతున్న పురుషుల గురించి చర్చ జరిగింది. కానీ ఇలాంటి ఆత్మహత్యలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 

మరిన్ని చూడండి

Source link