TDP Activist Swathi Reddy Revealed Nature of CM Jagan స్వాతి రెడ్డిని తట్టుకోలేకపోతున్నారు


Thu 29th Jun 2023 06:00 PM

swathi reddy  స్వాతి రెడ్డిని తట్టుకోలేకపోతున్నారు


TDP Activist Swathi Reddy Revealed Nature of CM Jagan స్వాతి రెడ్డిని తట్టుకోలేకపోతున్నారు

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎలా ఉన్నా రెడ్డి కులస్తులు చాలామంది జగన్ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా జగనన్న అంటూ మట్లాడుతూ ఉంటారు. జగన్ వలన రాష్ట్రం ఎలా ఉన్నా, ఎటు పోయినా రెడ్డి కులస్తులకు మాత్రం జగన్ దేవుడే. కానీ ఇప్పుడో రెడ్డి కులానికి చెందిన స్వాతి రెడ్డి అనే అమ్మాయి జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలని ఇష్టమొచ్చినట్టుగా ఆడుకుంటుంది. విదేశాల్లో ఉండి.. సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తోంది. ఇప్పుడు స్వాతి రెడ్డిని ఎదుర్కోవడానికి వైసీపీ నేతలు కిందా మీదా పడుతున్నారు.

ముఖ్యంగా ఆమెపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అసలు స్వాతి రెడ్డే కాదు.. ఆమె కమ్మ కులస్తురాలంటూ, ఆమె వైసీపీ మహిళలపై నీచమైన మాటలు మాట్లాడుతుంది అంటూ స్వాతి రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి అని చెప్పుకొని టీడీపీకి భజన చేస్తున్న ఆ అమ్మాయి పేరు స్వాతి రెడ్డి కాదు.. శ్వేతా చౌదరి. ఆమె తన నిజమైన పేరు పక్కనపెట్టి స్వాతి రెడ్డి అనే పేరుతొ సోషల్ మీడియాలో వైసీపీ ని టార్గెట్ చేస్తుంది.. శ్వేతా చౌదరి చేసే ట్వీట్స్ అన్ని చంద్రాబాబు నాయుడే వెనుకుండి నడిపిస్తున్నారు అంటూ చంద్రబాబు డైరెక్షన్ లోనే శ్వేతా చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి సోషల్ మీడియాలో నడుస్తుంది.. అంటూ గగ్గోలు పెడుతున్నారు.

స్వాతిరెడ్డి సీఎం జ‌గ‌న్ పై, ఏపీ ప్ర‌భుత్వంపై ట్విట్ట‌ర్‌లో అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తోంది. అయినా ఈమెకు YCP కార్య‌క‌ర్త‌లు, అభిమానులు దీటుగా బదులిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుంది. స్వాతి రెడ్డి మాత్రం వైసీపీ నేతలని ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తుంది. ప్రతి దాన్ని విడమర్చి వారు ఏం చేస్తున్నారో, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ట్వీట్స్ ద్వారా సోషల్ మీడియాలో జగన్ గుండెల్లో నిద్రపోతుంది. ఒక్కోసారి స్వాతి రెడ్డి ట్వీట్స్ కి వైసీపీ నేతలకి ఏం చెయ్యాలో కూడా అర్ధం కాక ఆమెపై తప్పుడు ఆరోపణలు కూడా దిగుతున్నారు. అయినప్పటికీ స్వాతి రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గదు. అన్నట్టు స్వాతి రెడ్డి ట్వీట్స్ ని నారా లోకేష్ కూడా రీ ట్వీట్స్ చేయడమే వైసీపీ నేతలకు పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డం పడుతున్నట్టుగా అయ్యి, కక్కలేకమింగలేకుండా ఉన్నారు.


TDP Activist Swathi Reddy Revealed Nature of CM Jagan:

Swathi reddy targets YCP party and CM jagan





Source link