ByGanesh
Mon 31st Mar 2025 04:43 PM
రంజాన్ సెంటిమెంట్ తో తన సినిమాలను రంజాన్ కి విడుదల చేసి కోట్లు కొల్లగట్టే సల్మాన్ కి ఈ రంజాన్ మాత్రం బిగ్ షాక్ ఇచ్చింది. 2025 రంజాన్ ని టార్గెట్ చేసి తమిళ డైరెక్టర్ మురుగదాస్ తో సికందర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే.. అది అత్యంత దారుణమైన ఫలితాన్నిసల్మాన్ కి అందించింది.
సికందర్ మూవీ విడుదలకు ముందు నుంచి ఎలాంటి బజ్ క్రియేట్ చెయ్యలేకపోవడము, సినిమా విడుదలకు ముందు రోజు రాత్రే ఆన్ లైన్ లో సినిమా లీక్ అవడంతో సల్మాన్ సికందర్ చిత్రానికి ఓపెనింగ్స్ లేకుండా పోయాయి. సల్మాన్ ఫ్లాప్ సినిమాలు కూడా వందల కోట్లు వసూళ్లు చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ సికందర్ పరిస్థితి వేరేలా ఉంది.
సికందర్ కి మొదటిరోజు ఓవరాల్ గా 30.06 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇది సల్మాన్ చిత్రాల్లో టాప్ 8 లో నిలిచింది. ఓపెనింగ్స్ పరంగా సికందర్ సెన్సేషనల్ నెంబర్లు నమోదు చేస్తుంది అనుకుంటే సికందర్ దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సల్మాన్ అభిమానులకు షాకిచ్చింది. ఈలెక్కన సల్మాన్ ఖాన్ కు ఉన్న ఇమేజ్ పూర్తిగా తగ్గిందనే చెప్పాలి.
Terrible openings for Sikander:
Sikandar Opening Day Collection