Tesla has advertised for 13 jobs in India the job announcement comes after Elon Musk met with Modi | Tesla Hiring in India: భారత్‌లో ఉద్యోగాలకు ‘టెస్లా’ ప్రకటన

Tesla Begins Hiring In India: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా కార్యకలాపాలు భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. దీనికోసం, టెస్లా నుంచి ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన అమెరికా పర్యటనలో, టెస్లా CEO ఎలాన్ మస్క్‌పై ఎలాంటి మ్యాజిక్ చేశారో గానీ, మోదీ పర్యటన పూర్తయిన వారం రోజుల్లోనే ఈ ఉద్యోగ ప్రకటన వెలువడింది. 

టెస్లా ఉద్యోగ ప్రకటన
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, తన లింక్డ్ఇన్ పేజీలో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చింది. ఆ ప్రకటనల ప్రకారం.. టెస్లా కంపెనీకి కస్టమర్-ఫేసింగ్‌ (customer-facing jobs) & బ్యాక్-ఎండ్ ఉద్యోగాలు ‍‌(back-end jobs) సహా 13 రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిలో… సర్వీస్ టెక్నీషియన్ (service technician), వివిధ సలహా ఉద్యోగాల్లో (advisory roles) ఐదు ఖాళీలు ముంబై & దిల్లీలో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఖాళీల్లో కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ & డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటివి ఉన్నాయి, ఇవి ముంబైలో అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంజినీరింగ్, అమ్మకాలు లేదా కార్యకలాపాలలో అనుభవం ఉంటే మీరు కూడా ఈ గ్లోబల్‌ కంపెనీల భాగం కావచ్చు.

అధిక దిగుమతి సుంకాల కారణంగా, టెస్లా కంపెనీ ఇంతకాలం భారత్‌ నుంచి దూరంగా ఉంది. భారతదేశం ఇప్పుడు $40,000 కంటే ఎక్కువ ధర ఉన్న హై-ఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది.

వాస్తవానికి, భారతదేశం విషయంలో ఎలాన్ మస్క్ ప్రణాళిక చాలా పెద్దది. ప్లాన్‌ను బట్టి ఉద్యోగాల ఖాళీల భర్తీకి త్వరలో మరికొన్ని ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

పాత బ్యాటరీల బ్రాండ్ రీస్టోర్‌ ప్రారంభం
బ్యాటరీ తయారీ సంస్థ “టెస్లా పవర్ ఇండియా”, రాబోయే రోజుల్లో భారతదేశంలో మరింతగా విస్తరించబోతోంది. ఆ కంపెనీ తన వ్యాపార విస్తరణలో భాగంగా కొత్త నియామకాలు చేపట్టాలని ఆలోచిస్తోంది. ఈ సమాచారాన్ని టెస్లా సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. “టెస్లా పవర్ ఇండియా”, పాత బ్యాటరీలను రీకండిషన్ చేయడానికి & విక్రయించడానికి తన బ్యాటరీ బ్రాండ్ రీస్టోర్‌ను ఇటీవలే ప్రారంభించింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా 5,000 రీస్టోర్ బ్రాండ్ స్టోర్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. టెస్లా పవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కవిందర్ ఖురానా చెప్పిన ప్రకారం, “భారతదేశంలో మా వ్యాపార విస్తరణ కొనసాగిస్తున్నాం. ఆవిష్కరణల ద్వారా మా లక్ష్యాలను సాధించేందుకు ప్రతిభావంతులైన వ్యక్తులు అవసరం. మా బృందంలోకి కొత్త ప్రతిభను స్వాగతించడానికి & మా లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త వాళ్ల సహకారాన్ని ఉపయోగించుకుంటాం” అని చెప్పారు.

EV మార్కెట్‌కు టెస్లా ఊతం
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ క్రమంగా ఊపందుకుంది. టెస్లా వస్తే ఇది మరింత వేగవంతం అవుతుంది. గత సంవత్సరం 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. టాటా గ్రూప్ కూడా బ్యాటరీ వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెడుతోంది.

మరో ఆసక్తికర కథనం: ఆగని పసిడి దూకుడు – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

మరిన్ని చూడండి

Source link