సిరిసిల్ల జిల్లా పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలికలు, మహిళల భద్రత కోసం ‘పోలీస్ అక్క’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా “పోలీస్ అక్క” పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కానిస్టేబుల్ ను ఎంపిక చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు.