MP Man Demanded Half Of His Fathers Deadbody: ఓ కుమారుడు తండ్రి అంత్యక్రియల విషయంలో సోదరునితో గొడవపడ్డాడు. తండ్రి చివరి కోరిక మేరకు తానే అంత్యక్రియలు చేస్తానని చిన్న కుమారుడు పట్టుబట్టగా.. ఇందుకు పెద్ద కుమారుడు నిరాకరించాడు. సోదరునితో గొడవ పడి.. తండ్రి మృతదేహాన్ని సగానికి కోసి పంచాలని డిమాండ్ చేశాడు. చివరకు పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) తికమ్గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని లిధోరాతాల్ గ్రామంలో ధ్యానీ సింగ్ ఘోష్ (84) తన చిన్న కుమారుడు దేశ్‌రాజ్‌తో కలిసి జీవిస్తున్నాడు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధ పడుతోన్న ఘోష్ ఆదివారం మృతి చెందాడు. తండ్రి మరణవార్త తెలుసుకున్న మరో కుమారుడు కిషన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ గ్రామానికి చేరుకున్నాడు.
‘మృతదేహాన్ని కోయండి’
మద్యం మత్తులో ఉన్న కిషన్ తండ్రికి తానే అంత్యక్రియలు నిర్వహిస్తానని పట్టుబట్టాడు. అయితే, దీనికి చిన్న కుమారుడు దేశ్రాజ్ అభ్యంతరం తెలిపాడు. తండ్రి చివరి కోరిక మేరకు తానే అంత్యక్రియలు నిర్వహిస్తానని చెప్పాడు. దీంతో సోదరునితో కిషన్ గొడవపడ్డాడు. గ్రామస్థులు నచ్చచెప్పేందుకు యత్నించినా ఎవరి మాటా వినలేదు. తండ్రి మృతదేహాన్ని సగానికి కోసి ఇద్దరికీ పంచాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కిషన్‌కు నచ్చచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం చిన్న కుమారుడు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేశాడు.
Also Read: Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది – ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
మరిన్ని చూడండి