ByGanesh
Fri 14th Feb 2025 10:02 AM
ఫైనల్లీ తొమ్మిది నెలల సస్పెన్స్ తర్వాత వల్లభనేని వంశీ ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. టీడీపీ ఆఫిస్ పై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న వంశీని ఎట్టకేలకు హైదరాబాద్ గచ్చిబౌలిలో అతని నివాసంలోనే అరెస్ట్ చేసారు. మరి లోకేష్ గన్నవరం యువగళం పాదయాత్రలో ఛాలెంజ్ చేసినట్లే వంశీ అరెస్ట్ అవడం పట్ల టీడీపీ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని తన అనుచరులతో కలిసి చేసిన ఆగడాలు ఒక ఎత్తు, అసెంబ్లీలో కొడాలి నాని తో కలిసి నారా భువనేశ్వరి పై చేసిన కామెంట్స్ ఒక ఎత్తు. ఇప్పుడు వంశీ ని కూటమి ప్రభుతం అరెస్ట్ చెయ్యగా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని నే అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అధికార మదంతో రెచ్చిపోయిన స్నేహితులు ఇద్దరూ కలిసి కట్టుగా జైలుకెళ్ళాసిందే అంటూ టీడీపీ అభిమానులు ఆతృతగా ఉన్నారు.
ఇప్పటికే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు లోకేష్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొడాలి లాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలని పట్టుబడుతున్నారు. మరి వైసీపీ ఓడిపోయాక రాజకీయాల్లో యాక్టీవ్ గా లేని కొడాలి నాని కూటమి ప్రభుత్వ కేసులకు భయపడే కామ్ గా ఉంటున్నాడు. వంశీ అరెస్ట్ అయ్యాక నాని ప్రెస్ మీట్ పెడతాడు అనుకున్నారు.
కానీ ఎప్పటిలాగే కొడాలి సైలెంట్ గానే ఉన్నాడు. నెక్స్ట్ టార్గెట్ నేనే అనే భయం కొడాలికి ఉండి ఉండొచ్చు అంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
The next target is Nani:
Next target Kodali Nani arrest