Niece Who Stole From Her Aunt House In Rajasthan: ఓ యువతి తన ప్రియుడితో కలిసి మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడింది. పక్కా ప్లాన్‌తో రూ.15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచేసింది. అనంతరం పోలీస్ విచారణలో అసలు దొంగ మేనకోడలే అని తేలడంతో అంతా షాకయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అల్వార్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని నౌగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఇటీవల రూ.15.25 లక్షల నగదు సహా బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
ప్రీత్ కౌర్ తన సోదరుడి అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు బాక్సులో ఉంచిన నగదు సహా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రీత్ కౌర్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తన మేనకోడలు జస్పాల్, ఆమె ప్రేమికుడు నానక్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. ఈ క్రమంలో వారిని విచారించగా జస్పాల్.. తన ప్రియుడు నానక్ సింగ్‌తో కలిసి ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో జస్పాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు. చోరీ చేసిన మొత్తం డబ్బును త్వరలోనే రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: Father Dead Body: ‘నా తండ్రి మృతదేహం 2 ముక్కలు చేయండి’ – ఓ కొడుకు డిమాండ్, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన
మరిన్ని చూడండి