The young lady who went late to the examination center entered the examination center from under the gate in bihar video gone viral | Viral Video: ఎగ్జామ్ టైం అయిపోయింది

Young Woman Entered Under The Gate To Exam Center In Bihar: చాలా పోటీ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ క్రమంలో అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకుని పరీక్ష రాయకుండానే వెనక్కు వెళ్లిపోయిన ఘటనలు చూశాం. అయితే, బీహార్‌లోని (Bihar) పరీక్షా కేంద్రంలో ఓ యువతి మాత్రం తెలివిగా వ్యవహరించింది. గేట్లు మూసేసినా దాని కింద నుంచి కేంద్రంలోకి వెళ్లింది. దీనికి సదరు యువతి బంధువులు సహకరించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని నవాడా ప్రాంతంలో ఓ యువతి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. అయితే, అప్పటికే సిబ్బంది గేట్లు మూసేశారు.

ఈ క్రమంలో తెలివిగా వ్యవహరించిన యువతి గేట్ కింద ఉన్న చిన్న గ్యాప్ గుండా లోపలికి దూరి వెళ్లింది. వెంట వచ్చిన బంధువులు సైతం ఆమెకు సహకరించారు. గేట్ కింద నుంచి యువతిని లోపలికి తోశారు. పరీక్షా కేంద్రం బయట ఉన్న పోలీసులు సైతం ఈ తతంగాన్ని పట్టించుకోలేదు. ఇది చూసేందుకు వచ్చిన జనాన్ని మాత్రం అదుపు చేశారు. అయితే, సదరు అభ్యర్థిని పరీక్షకు అనుమతించారో.? లేదో.? అనేది స్పష్టత లేదు. ఈ తతంగాన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. లాఫింగ్ ఎమోజీలతో కొందరు కామెంట్ చేయగా.. ఇలా చేయడమే కరెక్ట్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు.

Also Read: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో వసంత పంచమి – అమృత స్నానం చేస్తోన్న భక్తులపై పూల వర్షం, వీడియో వైరల్

మరిన్ని చూడండి

Source link