These are the wedding guests of Chaitu-Sobhita చైతు-శోభితల పెళ్లి గెస్ట్ లు వీరే

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. రేపు ఈ సమయానికి వీరి వివాహం పూర్తయిపోతుంది. డిసెంబర్ 4 రాత్రి 8:13 నిమిషాలకు చైతు-శోభితల వివాహం జరగబోతుంది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. ఇప్పటికే మంగళ స్నానాలు, నాగ చైతన్యను పెళ్లి కొడుకుని చేయడం, శోభితాను పెళ్లి కుమార్తెను చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అయితే అన్నపూర్ణ స్టూడియో లో జరిగే చైతు-శోభితల వివాహ వేడుకకు ఎవరెవరు అంటే అతిధులు ఎవరు అనే విషయంలో ఫుల్ సస్పెన్స్ నడుస్తుంది. కారణం నాగార్జున కేవలం 300 మందినే పెళ్లికి ఆహ్వానిస్తున్నాం అని చెప్పడంతో ఈ క్యూరియాసిటీ మొదలైంది.ఈ పెళ్ళికి ఇరు కుటుంబాలు పెద్దలు, వారి దగ్గరి బంధువులు మాత్రమే  హాజరవుతారని తెలుస్తుంది. 

వీరితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్‌, సురేష్‌బాబు, రానా, అభిరామ్‌ వారి కుటుంబ సమేతంగా హాజరు కాబోతున్నారట. ఇండస్ట్రీ ప్రముఖులైతే మెగాస్టార్ చిరు ఫ్యామిలీ, చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీ, తండేల్‌ మూవీ యూనిట్ పెళ్లికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.

అలాగే చైతు తో పని చేసిన హీరోయిన్స్ కూడా ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరోపక్క పొలిటికల్ గా నాగార్జున ఈ వివాహానికి ఎవరెవరిని ఇన్వైట్ చేసారు అనే విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ కనిపిస్తుంది. 

Source link