Donald Trump Bans Paper Straws Brings Back Plastic: హింసించే రాజు ఇరవయ్యో పులకేశీ గురించి మనం ఇక్కడ సినిమాగా చూసి ఉంటారు కానీ అమెరికన్లు మాత్రం ట్రంప్ లో అలాంటి లక్షణాలు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. ఆయన ఇస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను చూసి చాలా మంది బిక్కచచ్చిపోతున్నారు. తాజాగా ఆయన ఓ విచిత్రమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను పాస్ చేశారు. అదేమిటంటే పేపర్ స్ట్రాలను బ్యాన్ చేయడం. మీరు కరెక్ట్ గానే చదివారు. ప్రపంచం అంతా ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేస్తోంది. కానీ ట్రంప్ మాత్రం పేపర్ స్ట్రాలను బ్యాన్ చేశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.
బైడెన్ తన పాలనలో అమెరికాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అందులో భాగంగా ప్లాస్టిక్ స్ట్రాల బ్యాన్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. 2035 నాటికి అమెరికాలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉండకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఆ ఆదేశాలన్నీ రద్దు చేశారు. రివర్స్ లో ఫెడరల్ కార్యాలయాల్లో ఎక్కడా పేపర్ స్ట్రాలు వాడాల్సిన పని లేదు.. ప్లాస్టిక్ స్ట్రాలు మాత్రమే వాడాలని ఆదేశాలు ఇచ్చారు. బయట ఎవరైనా పేపర్ స్ట్రాలు కొనుక్కుంటే వాళ్లిష్టం.
ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తున్న సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల ఏమీ వర్కవుట్ కాదని.. ఈ పేపర్ స్ట్రాలు ఒక్కోసారి చినిగిపోతున్నాయని.. మరో సారి డ్రింక్స్ చిందేలా చేస్తున్నాయని .. తనకు చాలా సార్లు అనుభవమయిందన్నారు. అంటే తాగేటప్పుడు అసౌకర్యానికి గురి చేస్తున్నాయని ఆయన వీటిని బ్యాన్ చేసేసి ప్లాస్టిక్స్ కు అనుమతి ఇచ్చారు. ట్రంప్ ఇలాంటి రివర్స్ నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు.
ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని అనుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఫ్రూటీ ప్యాకెట్లపై కూడా ఇప్పుడు పేపర్ స్ట్రాలే వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఓ మాట మీద నిలబడి ప్లాస్టిక్ భూతం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం తేడాగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో ప్రపంచ పర్యావరణం మరోసారి ప్రమాదంలో పడే అవకాశం. ఏంటి ఒక్క ప్లాస్టిక్ స్ట్రాల వల్లేనా అనే డౌట్ రావాల్సిన పని లేదు.. ట్రంప్ ఒక్క పేపర్ స్ట్రాలకే దీన్ని పరిమితం చేయడం లేదు.. మొత్తం ప్లాస్టిక్ పై వేసిన నియంత్రణ ఉత్తర్వులను తొలగించారు. అమెరికానే అలా చేస్తే ఇతర దేశాలు తమకు ఎందుకు ఖర్చు అని అవి కూడా అదే పని చేస్తాయి.
Also Read: ఈ వీధిలోకి షాపింగ్‌కు వెళ్తే కనీసం రూ.2 లక్షలు ఖర్చు ఖాయం – ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ షాపింగ్ స్ట్రీట్ ఏదో తెలుసా ?
మరిన్ని చూడండి