Todays Top 10 Headlines 10th July Andhra Pradesh Telangana Politics Latest News Today From Abp Desam | Top 10 Headlines Today: వ్యక్తిగత విమర్శలపై పవన్ సీరియస్‌

Top 10 Headlines Today: 

జగన్‌ దిగజారి మాట్లాడారు- పవన్ ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్నది దిగజారుడు రాజకీయాలు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పాలిటిక్స్ లో విలువలు నిలబెట్టేలా తాను వ్యవహరిస్తుంటే అధికార పార్టీ వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తనను వ్యక్తిగతంగా దూషిస్తూ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వారాహి విజయయాత్ర రెండో విడత ఆదివారం సాయంత్రం ఏలూరు నుంచి ప్రారంభమైంది. మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నా.. దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ ను ఇక నుంచి నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తాను అన్నారు. హోదా మరిచి దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే, గౌరవం ఇవ్వాల్సిన అగత్యం లేదని స్పష్టం చేశారు. మర్యాద పుచ్చుకోలేని వారికి ఇవ్వడమూ అనవసరం అన్నారు పవన్. సీఎం పదవికి జగన్ అనర్హుడు అని, వైసీపీ నేతల అన్యాయం, దుర్మార్గాలపై ప్రశ్నిస్తున్నానన్న కోపంతోనే తనను పెళ్లిళ్లు అని, లేక ఇంట్లో ఆడవారిపై వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తితంగా దాడి చేయించడం అందుకు నిదర్శనం అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బరాబర్‌ మాట్లాడతాం: గవర్నర్ తమిళిసై

గవర్నర్లు రాజకీయాలపై మాట్లాడకూడదని, కామెంట్లు చేయకూడదని కొందరు రాజకీయ నాయకులు తరచుగా అంటుంటారు. అయితే ఈ విషయంపై తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఘాటుగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉందన్నారు. రాజకీయ చర్చల్లో పాల్గొనడానికి పార్టీల నేతలకు ఎంత హక్కు ఉందో, గవర్నర్‌లకు అంతే హక్కు ఉందన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై ఇటీవల మాట్లాడుతూ.. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించడం మానుకోవాలన్న వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పేపర్‌ లీకేజ్‌ కేసులో 16 వ ర్యాంకర్ అరెస్టు

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. సిట్ మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.  అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఈ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగం పెంచడంతో నిందితులు ఒక్కరూ ఒక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఈఈ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించిన ఎం నాగరాజును  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రూ.30 లక్షలు ఇచ్చేందుకు రమేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎం నాగరాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం నాగరాజు ఏఈ పరీక్ష పత్రాన్ని రమేష్ నుంచి కొనుగోలు చేశాడు. విచారణలో భాగంగా తేలడంతో సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేశారు. నాగరాజు అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 54కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తిన్నది అరగక చేసేదే అమరావతి ఉద్యమం: వైసీపీ ఎంపీ 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చిన తర్వాతే ఏపీకి సీఎం అయ్యారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నోరు తెరిస్తే వైఎస్ జగన్ జైలుకెళ్లారని విమర్శిస్తున్నారని, ప్రజలు కోరుకున్నారు కాబట్టే ఆయనను సీఎం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిన్నది అరగక చేసేదే అమరావతి ఉద్యమం అని, బలవంతంగా భూములు లాక్కుని రాజధాని ఏర్పాటు చేశారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కోసమే నక్కా ఆనంద్ బాబు మాట్లాడాడరని, కావాలంటే తాము సైతం చంద్రబాబుపై వ్యక్తిగతంగా అలా మాట్లాడగలం అన్నారు. కానీ కొంచెం విజ్ఞత ఉంది, కనుక మేం పద్ధతిగా వెళ్తున్నామని చెప్పారు. అమరావతి పెయిడ్ టెంట్ వద్దకు వెళ్లి నక్కా ఆనంద్ బాబు నోటికొచ్చి మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారుపూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఉత్తరాఖండ్‌లో వరదల్లో తెలుగు వ్యక్తి మృతి

ఉత్తరాఖండ్‌‌లోని తేహ్రీ జిల్లా గులార్‌ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి వాహనం నది జాలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు మాక్స్ సోన్‌ ప్రయాగ నుంచి ప్రయాణికులు కారులో బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాలకుంటి బ్రిడ్జి నుంచి గులార్ వైపు వెళ్తుండగా..భారీ వర్షం కారణంగా కొండపై నుంచి రాయి విరిగి పడడంతో కారు అదుపు తప్పి నేరుగా నదిలోకి దూసికుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌

తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌ ప్రవేశాలకు మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వనపర్తి మహిళా వ్యవసాయ కాలేజీలో 120 సీట్లు,  కరీంనగర్‌ మహిళా వ్యవసాయ కాలేజీలో 120 సీట్ల చొప్పున ఉన్నాయి. ఆసక్తి కలిగిన  అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ట్విస్టులే ట్విస్టులు

పబ్‌జీలో పరిచయమైన యువకుడి కోసం వచ్చిన పాక్‌ మహిళ కథ ఎన్నో మలుపులు తిరుగుతోంది. జులై 4వ తేదీన ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. తరవాత బెయిల్ వచ్చింది. జైలు నుంచి వచ్చాక కూడా ఆమె మనసు ఏమీ మారలేదు. ఆ యువకుడితోనే కలిసుంటానని చెబుతోంది. ఇక ఆ యువకుడిపైనా కేసు నమోదైంది. అయినా కూడా ఇద్దరూ “మేం కలిసే బతుకుతాం” అని తేల్చి చెబుతున్నారు. “నా భర్త హిందూ. అంటే నేను కూడా హిందువునే. నేను ఇండియన్‌నే అని అనిపిస్తోంది” అని స్పష్టం చేసింది సీమా హైదర్. కొవిడ్ ప్యాండెమిక్‌ టైమ్‌లో పబ్‌జీ గేమ్ ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో నేపాల్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. సీమా హైదర్‌కి 30 ఏళ్లు కాగా…యువకుడు సచిన్‌కి 25 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నేపాల్‌లోనే ఒక్కటయ్యారు. ఆ తరవాత నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా ఇండియాకి వచ్చేసింది సీమా. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎంజీ మోటార్ ఇండియా న్యూ ఎలక్ట్రిక్ వాహనం 

ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల భారతదేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనం కారు కామెట్ ఈవీని విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.98 లక్షలు. ప్రజల్లో ఈ కారుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 1,184 యూనిట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు కంపెనీ కొత్త బవోజున్ యెప్ అనే కొత్త ఎలక్ట్రిక్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీతో మార్కెట్లో తన షేర్ పెంచుకోవాలనుకుంటోంది. ఎందుకంటే ఎంజీ ఇటీవలే భారతదేశంలో దాని డిజైన్‌ను కూడా పేటెంట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మారిపోయిన సమంత

టాలీవుడ్ నటి సమంతకు సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో అవకాశాలు వస్తున్నా.. అనారోగ్య సమస్యల వల్ల వెనకడుగు వేస్తోంది. తన సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై సమంత నేరుగా ప్రకటించకపోయినా.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

‘బజ్‌బాల్’ బోణీ కొట్టింది  

యాషెస్ సిరీస్‌లో  ‘బజ్‌బాల్’ బోణీ కొట్టింది.  స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న  యాషెస్ టెస్టు సిరీస్‌లో  వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ ఇంగ్లాండ్.. ఎట్లకేలకు  లీడ్స్‌లో  విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  ఐపీఎల్‌-16లో సన్ రైజర్స్ హైదరాబాద్  తరఫున ఆడిన  హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 75, 9 ఫోర్లు ) వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో క్రిస్ వోక్స్  (47 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు), మార్క్ వుడ్ (8 బంతుల్లో 16 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) లు పొరాడి ఇంగ్లాండ్ జట్టుకు ఈ సిరీస్‌లో తొలి విజయాన్ని అందించారు.  ఈ గెలుపుతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

Source link