Todays Top 10 Headlines 3rd July Andhra Pradesh Telangana Politics Latest News Today From Abp Desam

పవన్ వార్మింగ్‌ రోడ్డుకు మరమ్మతులు

వారాహి యాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తరువాత రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజోలు బైపాస్‌ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈనేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్‌ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఈ రోడ్డు పక్కాగా పుననిర్మించాలని కోరుతున్నారు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కాంగ్రెస్‌ హామీ 4000 పింఛన్‌

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘చేయూత’ పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు ప్రతీ నెలా రూ.4,000 పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రీసౌండ్‌ షురూ

ఖమ్మం జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. దొర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేంది కాంగ్రెస్ పార్టీ అని, కర్ణాటక సీన్ తెలంగాణలో రిపీట్ చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రం గురించి ఏ మాత్రం అవగాహన లేని నేత రాహుల్ గాంధీ అని, పోడు భూములకు తాము పట్టాలు ఇచ్చిన తరువాత మీరు ఇంక ఇచ్చేది ఏముందని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. పలు విషయాలను ప్రస్తావిస్తూ రాహుల్ కు చురకులంటిస్తూ మంత్రి హరీష్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కేజీ టమోటా రూ. 50లే

టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో కేజీ ధర రూ.100 మేర పెరిగింది. జూన్ మూడో వారం వరకు రూ.30 ఉన్న కేజీ టమాటా ధర, చివరి వారంలో ఏకంగా రూ.120- 130 కి చేరింది. అయితే పెరిగిన టమాటా ధరలతో రాష్ట్ర ప్రజల ఇబ్బందిని గమనించిన ఏపీ ప్రభుత్వం వారికి ఊరట కల్పిస్తోంది. కూరగాయల మార్కెట్లలో రాయితీపై టమాటాలను విక్రయిస్తోంది. కేజీ టమాటాను రూ.50కు విక్రయాలు మొదలుపెట్టడంతో ప్రజలు మార్కెట్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాంతో ఏపీలో రాయలసీమలో పలు జిల్లాల్లో కూరగాయల మార్కెట్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లోనూ తక్కువ ధరకు టమాటా విక్రయించి ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రోజుకు కేవలం రూ.45తో రూ.25 లక్షల రిటర్న్ పొందడం ఎలా?          

ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ (LIC), దేశంలోని ప్రతి జనాభా వర్గం అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రకటిస్తుంటుంది. వాటిలో కొన్ని హిట్‌ అవుతాయి, మరికొన్ని ఫట్‌ అవుతాయి. LIC పాలసీల్లో బాగా పాపులర్‌ అయిన ఒక స్కీమ్‌ ఉంది. దాని పేరు LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ (LIC New Jeevan Anand Policy). లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ చాలా కాలం నుంచి దీనిని కంటిన్యూ చేస్తోంది. ఇటీవలే, ఈ పాలసీ కొత్త వెర్షన్‌ను కూడా లాంచ్‌ చేసింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పడిపోయిన అమ్మకాలు

2023 జూన్‌లో హీరో మోటోకార్ప్ మొత్తం 4,36,993 యూనిట్లను విక్రయించింది. 2022 జూన్‌లో కంపెనీ మొత్తం 484,867 యూనిట్లను విక్రయించింది. గత నెలలో హీరో మొత్తం దేశీయ విక్రయాలు 422,757 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది జూన్‌లో విక్రయించిన 463,210 యూనిట్ల కంటే 8.7 శాతం తక్కువ. దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రారంభం ఉంది. అలాగే మొత్తం ఆర్థిక డిమాండ్‌లో పెరుగుదల బాగానే ఉంది. రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీఈసెట్-2023′ పరీక్ష ఫలితాలు

ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన ‘ఏపీఈసెట్-2023’ పరీక్ష ఫలితాలు జులై 2న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్ట్రీమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 20న ఏపీఈసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గురుపూజకు విశేష ప్రాధాన్యం

ఆషాఢ పూర్ణిమ వ్రతాన్ని గురు పూర్ణిమగా జరుపుకొంటారు. ఈసారి గురు పూర్ణిమ జూలై 3వ తేదీన జరుపుకొంటున్నారు. ఈ రోజు గురుపూజకు విశేష ప్రాధాన్యం ఉంది. మీకు ఎవరైనా గురువు ఉంటే, గురు పూర్ణిమ రోజున ఆయ‌న‌ నుంచి శ్రీగురు పాదుకా మంత్రాన్ని తీసుకోండి. కొన్ని కారణాల వల్ల గురువు మీతో లేకుంటే, లేదా మీకు గురువును కలిసే అవకాశం లేకుంటే, మీరు గురు పూర్ణిమ రోజున మీ గురువు చిత్రం లేదా పాదుక‌లను పూజించవచ్చు. గురు పూర్ణిమ రోజు మనం ఏ మంత్రాలను పఠించాలో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పాయల్‌ సంచలన ఆరోపణలు

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని పేరు కొందరికి మాత్రం ఒకే ఒక సినిమాతో వస్తుంది. అంటే ఓకే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడం అన్నమాట. అలా ఒకే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు. ఈ హీరోయిన్ ‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మొదటి సినిమాలోనే నటనతో పాటు తన అందాన్ని ఓ రేంజ్ లో ఆరబోయడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. దీంతో పాయల్ రాజ్ పుత్ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ అవకాశాలు ఏమి పాయల్ కి గుర్తింపును తేలేకపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రోజుకు 400 సిక్సర్లు కొట్టేవాడిని:జితేష్ శర్మ 

ఐపీఎల్ 2023 సీజన్ పంజాబ్ కింగ్స్‌కు నిరాశను అందించింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ పంజాబ్ కింగ్స్ యువ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పెద్ద షాట్లు సైతం అలవోకగా కొట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో జితేష్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 309 పరుగులు సాధించాడు. ఈ సమయంలో జితేష్ శర్మ స్ట్రైక్ రేట్ ఏకంగా 156గా ఉంది. అలాగే అతను టోర్నమెంట్‌లో 21 సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

Source link