Tomato Price Hike Maharashtra Farmer Becomes Millionaire In A Month By Selling Tomatoes

Tomato Price Hike: 

టమాటాలతో జాక్‌పాట్..

ఓ రైతు ఒక్క నెలలోనే లక్షాధికారి అవడం సాధ్యమేనా..? ఇందులో పెద్ద వింతేముంది..? ఏదైనా లాటరీ తగిలితే అయిపోతాడుగా అనుకోవచ్చు. కానీ…అలాంటి లాటరీలు ఏమీ తగలకుండా మహారాష్ట్ర రైతు లక్షాధికారి (Maharashtra Tomato Crop) అయిపోయాడు. కేవలం నెల రోజుల్లోనే. టమాటాలు పండించి అమ్మాడంతే. ఇప్పుడు టమాటాలకు బంగారానికి ఉన్నంత డిమాండ్ ఉంది మరి. పుణే జిల్లాకి చెందిన తుకారాం భాగోజీ గయాకర్ (Tukaram Bhagoji Gayakar) టమాటాలు పండించి జాక్‌పాట్ కొట్టాడు. ఉన్నట్టుండి వాటి ధర ఆకాశాన్నంటింది. ఇంకేముంది వెంటవెంటనే వాటిని తీసుకొచ్చి మార్కెట్‌లో పోశాడు. అన్నీ హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. నెల రోజుల్లో దాదాపు 13 వేల కేసుల టమాటాలు విక్రయించాడు. ఇలా రూ.1.5కోట్లు సంపాదించాడు తుకారామ్‌కి 18 ఎకరాల పొలం ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటానే పండించాడు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వీటిని సాగు చేసింది తుకారామ్ కుటుంబం. ఏయే ఫర్టిలైజర్‌లు వాడాలి..? ఏ మందులు వాడితే పురుగు రాకుండా ఉంటుంది..? అని చిన్నపాటి రీసెర్చ్ చేసి మరీ సాగు చేశారు. అలా సాగు చేయగా వచ్చిన టమాటాలను మార్కెట్‌కి తరలించే ముందు క్రేట్స్‌లో (Tomato Crates) సర్దుతారు. రోజుకి ఒకటి చొప్పున అమ్మి రూ.2,100 సంపాదించారు. 

లక్షల సంపాదన 

ఈ మధ్యే ఒకే రోజు అత్యధికంగా 900 క్రేట్‌ల టమాటాలు అమ్మేశారు. అలా ఒక్క రోజులోనే రూ.18 లక్షలు సంపాదించుకున్నారు. క్వాలిటీని బట్టి ఒక్కో కేస్ రూ.1000 నుంచి రూ.2,400 వరకూ పలుకుతోంది. ఈ ఒక్క రైతే కాదు. పుణేలో జున్నార్‌ ప్రాంతంలో టమాటాలు పండించిన రైతులు కూడా లక్షాధికారులు అయిపోయారు. నారాయణ్‌గంజ్‌తో పాటు జున్నార్‌లో మొత్తంగా కలిపి కమిటీ టమాటాలు విక్రయించగా…రూ.80 కోట్ల వ్యాపారం జరిగింది. దాదాపు 100 మంది మహిళలు ఉపాధి కూడా పొందారు. తుకారాం కోడలు విత్తనాలు వేసిన దశ నుంచి పంట చేతికొచ్చేంత వరకూ అన్ని పనులు చూసుకున్నారు. ఆయన కొడుకు మార్కెటింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. నెల రోజుల పాటు చెమటోడ్చి మొత్తం పంటను భారీ లాభాలతో అమ్ముకున్నారు. నారాయణ్‌గంజ్‌లోని జున్నూ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్‌ కమిటీలో నాణ్యమైన టమాటాలకు మంచి డిమాండ్ ఉంటోంది. 20 కిలోల బాక్స్‌ని రూ.2500 కి విక్రయిస్తున్నారు. 

 కర్ణాటకలోని ఓ అన్నదాత కుటుంబం ఒకే రోజు ఏకంగా రూ.38 లక్షల సొమ్ము కళ్లచూసింది!ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాట ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటాయి. రాష్ట్రాలు, నగరాలను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే చివరి నెల్లోనే ఏకంగా 326 శాతం ధర పెరిగిందని ప్రభుత్వ సమాచారం. కర్ణాటకలోని కొందరు రైతులకు ఇది వరంగా మరింది. కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం మంగళవారం 2000 బాక్సుల టమాట అమ్మి ఏకంగా రూ.38 లక్షలు సంపాదించింది. 

Also Read: PM Modi Dubai Visit: ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఎన్నో అంచనాలు, ఆ రంగంలో కీలక ఒప్పందాలు!

Source link