| Trump: మస్క్ కుమారుడు చీమిడి పూశాడట – 145 ఏళ్ల చరిత్ర ఉన్నదాన్ని చరిత్రలో కలిపేశాడు

Trump Removes Office Desk: టెస్లా, ఎక్స్ చీఫ్  ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఆయనకు డోజ్ అనే విభాగం ఏర్పాటు చేసి ఆ పదవి ఇచ్చారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడి చాంబర్ కు ఎలాన్ మస్క్ వెళ్లారు. ఆయన తనతో పాటు తన కుమారుడ్ని వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ కుమారుడి పేరు మనం చెప్పుకోలేం. ఎందుకంటే అది అంత బూతు పేరు కాదు కానీ… పలకాలంటే చాలా మేధావి అయి ఉండాలి.  మస్క్ కుమారుడి పేరు  X Æ A-Xii. 

ఈ కుర్రాడ్ని తీసుకుని ట్రంప్ చాంబర్ కు వెళ్లాడు ఎలాన్ మస్క్. ఆ కుర్రాడి వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత ట్రంప్ చాంబర్ లో డెస్క్ మారిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా గత 144 ఏళ్లుగా ఉపయోగిస్తున్న డెస్క్ .. అంటే.. అధ్యక్షుడు సంతకాలు చేసేందుకు ఉన్న టేబుల్ ను తీసేశారు. ఎందుకు తీసేశారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. అసలు విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం.. ట్రంప్ మామూలోడు కాదని అనుకుంటున్నారు.  



 అసలేం జరిగిందంటే ఎలాన్ మస్క్ కుమారుడు .. ట్రంప్ చాంబర్ లో తెగ ఆడేశాడు. ఆ ఆటల్లో భాగంగాతన ముక్కులో వేలు పెట్టుకున్నాడు. దాన్నితీసి టేబుల్ కు పూశాడు. అలా ఎన్నిసార్లు పూశాడో కానీ.. దాన్ని ట్రంప్ చూశాడు. అప్పటికి ఆయన అసహ్యాన్ని దాచి పెట్టుకున్నారు కానీ అటు ఎలాన్ మస్క్ వెళ్లిపోగానే..  టేబుల్ ను తీయించేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

దాన్ని రెజల్యూట్ డెస్క్ అంటారు. అత్యధిక మంది US అధ్యక్షులు ఉపయోగించిన సాంప్రదాయ రిజల్యూట్ డెస్క్ . ఫిబ్రవరి 19న ట్రూత్ సోషల్ పోస్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఈ మార్పును ధృవీకరించారు. రిజల్యూట్ డెస్క్‌ను  రిపేర్ కోసం పంపినట్లుగా చెప్పుకొచ్చారు.  ట్రంప్ కు జెర్మోఫోబిక్ ఉందనిచెబుతారు. అందుకే ఆయన దాన్ని మార్పిస్తున్నారని అంటున్నారు.   

డొనాల్డ్ ట్రంప్ కు మొహమాటాలు ఉండవు. ఆయన   కుటుంబసభ్యుల్ని తప్పి అందర్నీ పురుగుల్లాగే చూస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కావాలంటే అందర్నీ పొగిడేస్తారు కానీ.. వారికి ఏదైనా ప్రయోజనం కల్పించాలంటే మాత్రం ఆలోచిస్తారని అంటారు. ఇప్పుడు మ్సక్ కుమారుడి విషయంలోనూ ఆయన అలాగే వ్యవహరించారు.   రెజల్యూట్ డెస్క్ ను త్యాగం చేసేశారు.  

Also Read: ఆ చిన్న గ్రామంలో అందరూ యూట్యూబర్లే – బయటకు వెళ్లకుండా లక్షల సంపాదిచేస్తున్నారు !

 

మరిన్ని చూడండి

Source link