TruthTell Hackathon : ప్రస్తుతం ప్రసార సాధనాల నెట్ వర్క్ మరింత విస్తరించింది. సమాచారం క్షణాల్లో ప్రపంచానికి చేరిపోతోంది. కానీ అదే సమయంలో అంతే వేగంగా తప్పుడు సమాచారమూ ఆధిపత్యం చలాయిస్తోంది. దీని వల్ల వాస్తవాలను గుర్తించడం, తప్పుడు వార్తలను నివారించడం ప్రసార సంస్థలకు, జర్నలిస్టులతోపాటు ప్రేక్షకులకూ క్షిష్టంగా మారింది. అందుకే ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) సహకారంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ((MEITy) ట్రూత్ టెల్ హ్యాకథాన్ ను ప్రారంభించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025లోని క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ (CIC)కి చెందిన ఒకటో సీజనులో ఈ హ్యాకథాన్ ఓ భాగంగా ఉంది. లైవ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజంలో తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు ఏఐ(Artificial Intelligence)- ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడమే ఈ వినూత్న పోటీ లక్ష్యం.
రియల్ టైంలో తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, దాన్ని వ్యాప్తిలోకి తెస్తున్న వర్గాల ఆచూకీని కనిపెట్టి, నిజాన్ని నిగ్గుతేల్చేందుకు కృత్రిమ మేధను ఉపయోగించుకొంటూ కొన్ని సాధనాలను రూపొందించాల్సిందిగా డెవలపర్లను, డేటా సైంటిస్టులను, మీడియాలోని వృత్తినిపుణులను ఈ హ్యాకథాన్ కోరుతోంది. దీనికోసం రూ.10 లక్షల విలువైన బహుమతులను ఇవ్వనున్నారు. గెలిచే జట్లకు నగదు బహుమతులను ఇవ్వడం, మార్గదర్శకత్వాన్ని అందించే అవకాశాలను కల్పించడంతోపాటు ప్రాథమిక దశలో ప్రముఖ సాంకేతిక నిపుణుల వద్ద నుంచి సహాయ, సహకారాలను కూడా అందజేయనున్నారు. జర్నలిజంలో కృత్రిమ మేధస్సు నైతిక వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా చేసుకుని ఈ బహమతులను అందించనున్నారు.
5,600+ registrations and counting!
Join the TruthTell Hackathon, a part of Create in India Challenge by @WAVESummitIndia, and help combat misinformation in live broadcasting.
Win mentorship, funding, and prizes worth ₹10 Lakh. Empowering ethical journalism!
Register now!… pic.twitter.com/3tyQO7CnKe
— Ministry of Information and Broadcasting (@MIB_India) February 4, 2025
ఈ హ్యాకథాన్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి 5,600కు పైగా మంది ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు ముందుకువచ్చి రిజిస్ట్రేషన్లను చేసుకున్నారు. ఇందులో 36 శాతం మంది మహిళలున్నారు. ప్రసార మాధ్యమాల రంగంలో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ హ్యాకథాన్ ను ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (CIC) సీజన్ 1లో భాగం. దీనికి ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), ఇండియాఏఐ (IndiaAI) మిషన్, డేటాలీడ్స్ (DataLEADS) వంటి ప్రధాన సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.
హ్యాకథాన్‌లో దశలు, ముఖ్య తేదీలు:
శాంపిల్స్ ను దాఖలు చేయడానికి చివరి గడువు: ఫిబ్రవరి 21, 2025
చివరి తేదీ: మార్చి 2025 నెలాఖరు వరకు
విజేతల్ని ప్రకటించే వేదిక : వేవ్స్ సమ్మిట్ 2025
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంబంధించిన వివరాలకు, నమోదుకు https://icea.org.in/truthtell/ ను సందర్శించవచ్చు.
వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025లో భాగమైన ఈ హ్యాకథాన్ పలు దశల్లో జరగనుంది. జర్నలిజం(Journalism)లో ఏఐ – ఆధారిత పరిష్కారాలతో భారతదేశం ముందుకు సాగుతోన్న నేపథ్యంలో.. నైతిక, పారదర్శక మీడియా రిపోర్టింగ్ భవిష్యత్తును రూపొందించడంలో ట్రూత్ టెల్ హ్యాకథాన్ కీలకపాత్ర పోషించనుంది.
Also Read : RBI MPC Meeting: ఆర్‌బీఐ కొత్త గవర్నర్ నేతృత్వంలో తొలి MPC భేటీ – బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుతాయా?
మరిన్ని చూడండి