TS DSC Exam 2023 : త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్

Telangana DSC 2023 Updates: టీచర్ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టింది. ఇప్పటికే భర్తీ చేసే పోస్టులకు సంబంధించి వివరాలను పేర్కొంది. ఆయా పోస్టుల భర్తీకి అనుమతులు కూడా జారీ చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం కలిపి 5,089 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అయితే ఈ సంఖ్య తక్కువగా ఉందని… పోస్టుల సంఖ్యను పెంచాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి ఏమైనా ప్రకటన ఉంటుందా అన్న చర్చ ఉంది.

Source link