TSRTC Merger Bill : ఆర్టీసీ విలీనం బిల్లుపై ట్విస్ట్! ‘టైం’ కావాలన్న గవర్నర్‌

TSRTC Merger Bill Update: తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య కుదరనట్టే కనిపిస్తోంది. సమయం, సందర్భం దొరికితే చాలు… సర్కార్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు గవర్నర్. ఇక అదే రేంజ్ లో ప్రభుత్వంలో ని మంత్రులు కూడా గవర్నర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. బీజేపీ ప్రతినిధిగా పని చేస్తూ… బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ మాట్లాడుతున్నారు. గతంలో పంపిన బిల్లుల విషయలంలోనే పెద్ద ఎత్తున చర్చ జరగగా… తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఆర్టీసీ విలీనం బిల్లుకు సంబంధించి రాజ్ భవన్ నుంచి అనుమతి రాలేదు. దీంతో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లు సీన్ మారిపోతుందా అన్న చర్చ మళ్లీ మొదలైంది.

Source link