TSRTC Merger Bill: తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య కుదరనట్టే కనిపిస్తోంది. సమయం, సందర్భం దొరికితే చాలు… సర్కార్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు గవర్నర్. ఇక అదే రేంజ్ లో ప్రభుత్వంలో ని మంత్రులు కూడా గవర్నర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గతంలో పంపిన బిల్లుల విషయలంలోనే పెద్ద ఎత్తున చర్చ జరగగా… తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఆర్టీసీ విలీనం బిల్లుకు సంబంధించి రాజ్ భవన్ నుంచి అనుమతి రాలేదు. బిల్లుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ సీఎస్ లేఖ రాశారు గవర్నర్. వాటిని నివృత్తి చేయాలని కోరారు. దీంతో విలీన ప్రక్రియకు బ్రేక్ లు పడినట్లు అయింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.