TSRTC Special Buses : మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఈ రూట్‍‌లో ప్రత్యేక బస్సు

మహిళా ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. చార్మినార్-గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించింది. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్.. బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్, ముసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్దికాపుల్, గాంధీ భవన్, అఫ్జల్ గంజ్ మీదుగా చార్మినార్ వెళ్తుంది. సాయంత్రం 5:20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి గండి మైసమ్మకు బయలుదేరుతుంది. ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

Source link