UK woman gets 12 month term for cyber farting at ex The bizarre reason explained | Viral News: ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు అలాంటి వీడియోలు పంపిన యువతి – 12 నెలలు శిక్ష వేసిన కోర్టు

UK woman gets 12 month term for cyber farting at ex The bizarre reason: యూకేలోని ఓ అమ్మాయికి కోర్టు పన్నెండు నెలల కమ్యూనిటీ స్రవీస్ శిక్ష విధించింది. ఆమె చేసిన నేరం ఏమిటంటే..  ‘సైబర్-ఫార్టింగ్’కు  పాల్పడటం. సైబర్ శృంగారం గురించి విని ఉంటారు కానీ ఈ సైబర్ ఫార్టింగ్ గురించి విని ఉండరు. ఈ నేరాన్ని మొదటి సారి ఆమె చేశారు.  కోర్టులో తాను ఆ నేరానికి పాల్పడ్డానని మహిళ కూడా  అంగీకరించింది.దాంతో కోర్టు రియాన్నాన్ ఎవాన్స్ అనే మహిళకు 300 బ్రిటన్ పౌండ్ల జరిమానాతో పాటు  12 నెలల కమ్యూనిటీ ఆర్డర్‌ను కూడా విధించింది. మరిన్ని శిక్షలు కూడా ఉన్నాయి.                

ఎవాన్స్  తన బాయ్ ఫ్రెండ్ తో కటీఫ్ చెప్పారు. ఇద్దరూ విడిపోయారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ను మానసికంగా ఇబ్బంది  పెట్టాలనుకున్నారు. అతనికి ఏది అయితే ఇష్టం ఉండదో  ఆ వీడియోలు పంపాలనుకున్నారు. తన బాయ్ ప్రెండ్ కు .. కడుపులో ఉన్న గ్యాస్ రిలీజ్ చేసేటప్పుడు వచ్చే శబ్దాలు, వాసన అంటే పడదని తెలుసు కాబట్టి తాను అలా .. గ్యాస్ రిలీజ్ చేస్తున్నప్పుడు  వీడియోలు అతనికిపంపింది. ఇవి చాలా అసభ్యకరమని మాజీ బాయ్ ఫ్రెండ్ భావించి కేసు పెట్టాడు. రోజుల వ్యవధిలో ఎవాన్స్ ఇలాంటి అనేక వీడియోలను పంపింది.                                                     

ఎవాన్స్ తాను వాటిని పంపానని అంగీకరించింది. అయితే  దురుద్దేశం లేకుండా పంపిందని ఆమె తరపు లాయర్ వాదించారు. కేవలం  హాస్యాస్పదంగా భావించింది కానీ బాధితురాలు అలా చేయలేదన్నారు. అయితే కోర్టు ఇది హరాస్ మెంట్ గానే భావించి శిక్ష విధించింది.  



 

ఈ శిక్షపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇక నుంచి గ్యాస్ ట్రబుల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 

 



 

Also Read: పావు గంట టైమ్ ఇస్తారు – ఎంత లెక్కపెడితే అంత బోనస్ – ఈ కంపెనీ రూటే వేరు!

మరిన్ని చూడండి

Source link