Uncli Acid Attack On Son In Law In Maharastra: మహారాష్ట్రలో (Maharastra) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హనీమూన్‌కు వెళ్లే చోటు వివాదంపై మామ, అల్లుళ్ల మధ్య ఘర్షణ రేగగా.. అది చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలోనే కొత్త అల్లుడిపై మామ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కల్యాణ్ పీఎస్ పరిధిలో ముర్తజా ఖోటాల్ (65) కుమార్తె అతీక్‌కు, ఇబాద్ అతీక్ పాల్కే అనే వ్యక్తికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ క్రమంలో హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లుడు మామకు చెప్పాడు. కశ్మీర్ వద్దని.. విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని మామ అల్లుడికి సూచించాడు.
ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన అతీక్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఇంట్లోకి వెళ్లబోయాడు. కాగా.. ఆవరణలోని కారులో వేచి ఉన్న మామ ఉన్న పళంగా అల్లుడి ముఖం, శరీరంపై యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న మామ ముర్తజా కోసం గాలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
మరిన్ని చూడండి