US Bangladesh Arms Deal: అమెరికా, బంగ్లాదేశ్ మధ్య సైనిక సహకారం ఒక కొత్త మలుపు తిరిగింది. బంగ్లాదేశ్‌కు కోట్ల డాలర్ల విలువైన సైనిక ఆయుధాలను అమ్మేందుకు అమెరికా ప్రణాళిక రచిస్తోంది. ఈ చర్య ప్రాంతీయ భద్రతపై పెను మార్పు చోటు చేసుకోనుంది. ఈ ఒప్పందం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. బంగ్లాదేశ్‌తో అమెరికా సైనిక సంబంధాల బలోపేతం ఇది భారతదేశ భద్రతా ప్రయోజనాలకు పెను సవాల్‌గా మారే ప్రమాదం కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.
బంగ్లాదేశ్‌కు ఆయుధాల అమ్మకాల ఈ ప్రతిపాదన ద్వారా ప్రాంతీయ భద్రతపై పడే ప్రభావం ఏంటీ? భారతదేశానికి కలిగే ముప్పు ఏమైనా ఉంటుందా అనే అంశాలు తెలుసుకుందాం.
వాస్తవానికి prothomalo.com నివేదిక ప్రకారం… అమెరికా సైన్యం డిప్యూటీ కమాండింగ్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ పి. వోవెల్ మార్చి 24న బంగ్లాదేశ్‌లో పర్యటించారు. అక్కడ బంగ్లాదేశ్ సైనికాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా ఆయుధాలను బంగ్లాదేశ్ కొనుగోలు చేసే అంశంపై చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్ సైన్యానికి, బాధ్యతల నిర్వహణ, విపత్తు సహాయ కార్యక్రమాల్లో మరింత మెరుగైన సహకారం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని వోవెల్ స్పష్టం చేశారు.
భారతదేశ భద్రతపై ప్రభావం
అమెరికా, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న సైనిక సంబంధాలపై భారతదేశం ఆందోళన చెందడం సహజం. ఇండియాకు పొరుగునే ఉండే బంగ్లాదేశ్ పెద్దఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తుందనే అంశం భారతదేశం ఆందోళన చెందవచ్చు. అమెరికా నుంచి బంగ్లాదేశ్ సైనిక ఆయుధాలు కొనుగోలు చేయడం, భారత్‌కూడా సైనిక ఒప్పందాలు కలిగి ఉన్నప్పుడు ప్రాంతీయ సమతుల్యతపై ప్రభావం పడొచ్చు. బంగ్లాదేశ్‌కు అమెరికా సైనిక సహకారం భారతీయ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండవచ్చా అనేది ముఖ్యమైన ప్రశ్నగా మారుతుంది.
అమెరికా వ్యూహాత్మక చర్య
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్న వేళలో బంగ్లాదేశ్‌తో సైనిక సహకారాన్ని పెంచాలని అమెరికా నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ సైన్యం ప్రొఫెషనలిజంను లెఫ్టినెంట్ జనరల్ వోవెల్ ప్రశంసించారు. బంగ్లాదేశ్ సైన్యం సహకారం ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం చాలా ముఖ్యమని అన్నారు. బంగ్లాదేశ్‌తో అమెరికా అధికారుల సైనిక సహకారం ప్రాంతీయ భద్రతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఏదైనా ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కాదని స్పష్టం చేస్తున్నారు.
ఈ డెవలప్‌మెంట్ ద్వారా, అమెరికా దాని సైనిక సహాయాన్ని పెంచి దాని వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. అయితే, బంగ్లాదేశ్ చర్యతో భారత్‌లో భద్రతాపరమైన ఆందోళనలు పెరగవచ్చు. అందువల్ల, ఈ కొత్త మార్పును దృష్టిలో ఉంచుకుని భారత్ రక్షణ, దౌత్య వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని చూడండి