US stock market is reeling under the blow of Deep Seek

US stock market is reeling under the blow of Deep Seek: చాట్ జీపీటీని మించి ఏఐ టూల్ గా ప్రచారంలోకి వచ్చిన చైనాకు చెందిన డీప్ సీక్ ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లను నట్టేట ముంచోంది. టెక్ దిగ్గజాలన్నీ వరుసగా తమ షేర్ వాల్యూని కోల్పోతున్నాయి.  2022లో విడుదలైన చాట్ జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ ని సృష్టించింది.  ఇప్పుడు చాట్‌ జీపీటీని మించిందని చైనాకు చెందిన డీపీ సీక్ అందుబాటులోకి వచ్చింది.  

రెండు వారాల్లోనే డీపీ సీక్ సంచలనం 

డీప్ సీక్ రెండు వారాల క్రితమే  చైనా సంస్థ అందుబాటులోకి వచ్చింది. పైగా చాట్ జిపిటి బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉచితం. అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. కానీ డీప్ సీక్ లో మాత్రం అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు.  చాట్ జిపిటి ని రూపొందించడానికి సుమారు 100 మిలియన్ డాలర్లు ఖర్చయిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీని కోసం ఎన్విడియా కంపెనీకి చెందిన అడ్వాన్స్డ్ చిప్స్ వాడారు.  చాట్ జిపిటి విడుదలకు ముందు 2021లో సుమారు 13 డాలర్లు ఉన్న ఈ ఎన్విడియా  స్టాక్ ఖరీదు, ఈ మూడు సంవత్సరాలలో   150 డాలర్ల కు పైగా చేరుకుంది. మైక్రోసాఫ్ట్ కన్నా అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. 

డీప్ సీక్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం ఎందుకంటే ? 
 
ఎన్విడియా  చిప్స్ వివిధ కారణాల వల్ల  చైనా కు అందుబాటు లో లేవు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ మొత్తం అమెరికా గుప్పిట్లో ఉంటుందని అనుకున్నారు.  అయితే చైనా  తక్కువ ఖర్చు తో డీప్ సీక్ మార్కెట్ లోకి విడుదలై చాట్ జీపీటీ కన్నా మెరుగైనదిగా పేరు తెచ్చుకున్నారు. ఇందులోనూ ఎన్విడియా చిప్‌లే వాడారు కానీ.. చైనాకు అందుబాటులో ఉన్నవే వాడారు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్ కంపెనీల స్టాక్స్ మీద దీని ప్రభావం గట్టి గా పడింది. దీంతో ఆ స్టాక్స్ విపరీతంగా పడిపోవడం కారణంగా  ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. అమెరికన్ స్టాక్ మార్కెట్లలో మూడు వంతులు పైగా భాగం మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా, ఆల్ఫాబెట్, ఎన్విడియా  తదితర టెక్నాలజీ స్టాక్స్ దే. అందుకే డీప్ సీక్ వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కోల్పోయిన వాటిలో కొంత రికవర్ అయినా.. నష్టం మాత్రం గట్టిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం స్వల్పం 

అమెరికన్ స్టాక్ మార్కెట్లలో టెక్ స్టాక్స్ హవా కారణంగా చైనా డీప్ సీక్ దెబ్బ గట్టిగా పడింది.  భారత స్టాక్ మార్కెట్  దీనికి భిన్నం.   బ్యాంకింగ్, ఫార్మా, FMCG, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన స్టాక్స్ గణనీయమైన వాటా ని కలిగి ఉన్నాయి. ఈ  కారణంగా ఒక రంగంలో ప్రతికూలత ఏర్పడినా ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొంత స్థిరత్వం ఉంటోంది.అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద డీప్ సీక్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉటుందన్నది ముందు ముందు బయటకు రానుంది. 

 

మరిన్ని చూడండి

Source link