US Supreme Court: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. విశ్వవిద్యాలయ అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం స్వాగతించారు. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో ఇప్పటి వరకు అమెరికా విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు ఇస్తున్నాయి. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు వర్సిటీ అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ అనే పదాలను ప్రధానంగా పేర్కొంటూ వస్తున్నారు. అయితే.. ఇకపై అడ్మిషన్లలో అలాంటి పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. తాజాగా అమెరికా సుప్రీం కోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. ఆయా పదాలను నిషేధిస్తున్నామని తన తీర్పులో వెల్లడించింది.
The odds have been stacked against working people for too long – we cannot let today’s Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards.
We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH
— President Biden (@POTUS) June 30, 2023
ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఈ సంచలన తీర్పును వెలువరించారు. ఒక స్టూడెంట్ ను అతని అనుభవాల ఆధారణంగా పరిగణించాలి గానీ జాతి ఆధారంగా కాదంటూ.. ఈ తీర్పును చదువుతూ జస్టిస్ జాన్ రాబర్ట్స్ వ్యాఖ్యానించారు. వర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత ప్రవేశాలు కొనసాగడానికి వీల్లేదంటూ తీర్పును చదివి వినిపించారు.
Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation.
Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d
— Vice President Kamala Harris (@VP) June 29, 2023
అమెరికాలోని అత్యంత ప్రముఖ విద్యాసంస్థలైన హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత పాటించాలని కోరుతూ ఓ విద్యార్థి సంఘం పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ ను విచారిస్తూ అమెరికా సుప్రీం కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఒకప్పుడు ఆఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష ఉండేది. ఆ సమయంలో వారికి అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశాలు దక్కేవి కావు. ఈ సమస్యను గుర్తించి అమెరికా ప్రభుత్వం.. 1960 లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా విశ్వవిద్యాలయాల్లో నల్ల జాతి పౌరులకు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో అడ్మిషన్ విధానంలో మార్పులు తీసుకువచ్చారు. అయితే ఈ తరహా నిబంధనల కారణంగా.. సమానత్వానికి తావు లేకుండా పోయిందన్నది ఒక గ్రూపు వాదన. ఈ నిబంధనల వల్ల మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరంగా అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదనలు వినిపించింది. ఆఫ్రో- అమెరికన్లను విద్యావకాశాలు కల్పించేందుకు ఆసియా- అమెరికన్ల పట్ల వివక్ష చూపుతున్నారని పిటిషన్లు వాదించారు. ధర్మాసంలో 6-3 మెజారిటీతో తాజా తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. హార్వర్డ్, నార్త్ కరోలినా వర్సిటీల్లో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది.
Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation.
Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d
— Vice President Kamala Harris (@VP) June 29, 2023
ప్రెసిడెంట్ బైడెన్ అసంతృప్తి
తాజా సుప్రీం తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ఇంకా వివక్ష కొనసాగుతోందన్న విషయాన్ని గుర్తు చేశారు. జాతుల పరంగా వైవిధ్యం ఉంటేనే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాలు అనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. అలాంటి నిబంధనల వల్లే తాను, తన భార్య మిచెల్లీ ఉన్నత చదువులు చదివినట్లు గుర్తు చేశారాయన.
Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table.
In the… https://t.co/Kr0ODATEq3
— Barack Obama (@BarackObama) June 29, 2023
సమర్థించిన డొనాల్డ్ ట్రంప్
సుప్రీం కోర్టు తాజా తీర్పుపై స్పందించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది శుభదినం అంటూ వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదో గొప్ప రోజు అన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన, ఆశించిన తీర్పుగా అభివర్ణించారు. ఈ తీర్పుతో ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.