US woman sues fertility clinic after giving birth to African-American baby through IVF | Viral News: శ్వేతజాతీయురాలికి ఆఫ్రికన్‌ను పుట్టించారు – ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకం

US woman sues fertility clinic : అమెరికాలో ఓ మహిళ తనకు మాతృత్వాన్నిప్రసాదించిన ఫెర్టిలిటీ క్లినిక్ పై దావా వేశారు. ఆ క్లీనిక్ చేసిన తప్పు వల్ల తాను జీవితాంతం బాధపడాలని ఆమె ఆ దావాలో పేర్కొన్నారు. పిల్లలు కావాలని వస్తే.. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టించారు అది తప్పా అని ఆ ఫెర్టిలిటీ క్లినిక్ అంటోంది. తప్పా.. తప్పున్నరా..అని ఆమె మండిపడుతోంది. అసలు నిజమేంటో తెలిస్తే క్లినిక్ యజమానుల్ని అలా ఎలా చేశారయ్యా… అని అడగాలనిపిస్తుంది. ఏం చేశారంటే.. ఐవీఎఫ్ చేయించుకున్న తెల్లజాతీయురాలు అయితే.. ఆమె ఫెర్టిలిటీ కోసం వాడిన స్పెర్మ్ నల్ల జాతీయుడిది. అయితే ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది. అదేమిటంటే ఆ మహిళ సరోగేట్ మదర్. 
   
తెల్ల జాతీయరాలైన ఓ మహిళ ఆఫ్రికన్ అమెరికన్ బిడ్డకు జన్మనిచ్చింది.  38 ఏళ్ల క్రిస్టెనా ముర్రే సరోగేట్ మదర్ గా మారి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆఫ్రికన్ అని పుట్టగానే అర్థమైపోయింది. నల్లజాతియులకు చెందిన వారి బిడ్డను కన్నట్లుగా ముర్రే .. ప్రసవం అయిన తర్వాత గుర్తించారు. నిజానికి ఆమె సరోగేట్ మదర్ గా ఉండాలనుకున్నది ఆఫ్రికన్ .. అమెరికన్ జంటకు కాదు. ఇద్దరు తెల్లజాతీయులైన జంటకు. వారిద్దరి ఎగ్స్, స్పెర్మ్స్ తీసుకుంటే.. నల్లజాతి బిడ్డ పుట్టే అవకాశం లేదు. అందుకే వారిద్దరికి పుట్టే బిడ్డ కోసం తనను సరోగేట్ గా మార్చలేదని.. వేరే వారి బిడ్డను తన గర్భంలోకి ప్రవేశ పెట్టారని ముర్రే గుర్తించారు. ఇది ఫెర్టిలిటీ క్లినిక్ చేసిన ఘోరమైన తప్పిదంగా భావించింది. 

అయితే ఆస్పత్రి మాత్రం తమ వద్ద తప్పు జరగలేదని వాదించింది. దాంతో ముర్రే ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని డిమాండ్ చేసింది. ఆ స్పెర్మ్ ఇచ్చిన వారు కూడా ఇదే వాదన వినిపించారు. ముర్రే తమ బిడ్డను మోయలేదని..వేరే వారి బిడ్డను కన్నదని.. తమ బిడ్డ అని  నిరూపించడానికి డీఎన్ఏ టెస్టు కావాలని  డిమాండ్ చేశారు. తాము ఇద్దరం తెల్ల జాతీయులం అయితే.. నల్లజాతి బిడ్డ ఎలా పుడతారని వారి వాదన. ఈ వ్యవహారం తమను జీవితాంతం బాధపెడుతుందని.. ఇక ముందుకు సాగలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారు న్యాయపోరాటం చేశారు.                    
 
తన బిడ్డను మొదటిసారి చూసినప్పుడు ఆమెకు కలిగిన షాక్ ఆమెకు స్పష్టంగా గుర్తుందని లాయర్ కోర్టులో వాదించారు. తన క్లయింట్  ఒక కాకేసియన్ మహిళ, ఆమె ఇలాంటి రూపాన్ని కలిగి ఉన్న స్పెర్మ్ దాతను ఎంచుకుందన్నారు. కానీ  ఆమె ప్రసవించిన బిడ్డ ఆఫ్రికన్ అమెరికన్. సంతానోత్పత్తి క్లినిక్‌లో ఇలాంటి తప్పులు ఎప్పుడూ జరగకూడదని లాయర్ అంటున్నారు.  2011లో, ఒహియోలో  2019లో, న్యూయార్క్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి.            
 

Also Read:  ఆకాశం నుంచి ఊడిపడబోతున్నసిటీ కిల్లర్ – ఓ నగరం మొత్తం భూస్థాపితం ఖాయం – ఇంతకీ ఏమిటో తెలుసా ?

మరిన్ని చూడండి

Source link