ByGanesh
Sun 16th Jul 2023 08:36 PM
యూట్యూబ్ వీడియోస్, షణ్ముఖ్ తో డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అవడమే కాకుండా.. సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోలకి సిస్టర్ కేరెక్టర్స్ లో మురిపించిన వైష్ణవి చైతన్య ఇప్పుడు హీరోయిన్ గా టర్న్ అయ్యింది. చూడడానికి సాంప్రదాయ పద్దతిలో.. పద్దతికి పట్టు చీర కట్టినట్టుగా ఉండే వైష్ణవి లోని టాలెంట్ మొత్తం ఆమె హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన బేబీ సినిమాలో చూపించేసింది. కాస్త నెగెటివ్ షేడ్స్ అయినా.. పెరఫార్మెన్స్ పరంగా వైష్ణవి చైతన్యని అందరూ మెచ్చుతున్నారు. గత నాలుగు రోజులుగా #VaishnaviChaitanya హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.
అయితే స్వతహాగా తెలంగాణ అమ్మాయి అయిన వైష్ణవి చైతన్య నేడు లాల్ ధర్వజా సింహవాహిని అమ్మవారి కోసం బంగారు బొనమెత్తింది. సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా వైష్ణవి చైతన్య బంగారు బొనమెత్తింది. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడు తాను అమ్మవారి కోసం ప్రత్యేకంగా బొనమెత్తుతానని.. కానీ ఎప్పుడూ లైన్ లో నించుని అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకునే దాన్ని. కానీ ఈసారి బంగారు బోనంతో స్పెషల్ ఎంట్రీతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
అక్కడ ఆలయ కమిటీ సభ్యులు వైష్ణవిని శాలువా కప్పి సత్కారం చేసారు. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య కాంబోలో సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ మూవీని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. రెండంటే రెండు రోజుల్లోనే బేబీ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించేసింది. దానితో టీం మొత్తం, ఇంకా ఇంకా ఖుషీగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిర్మాత SKN అయితే బేబీ రిజల్ట్ తో ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు.
Vaishnavi Chaitanya Offers Bonam:
Vaishnavi Chaitanya offers bonam at the Sri Simhavahini Mahankali temple