ByGanesh
Fri 01st Nov 2024 08:31 PM
వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్యని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఈరోజు కి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది ఇదే రోజు ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య ల వివాహము మెగా ఫ్యామిలీ, లావణ్య ల కుటుంబాల నడుమ చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వెడ్డింగ్ రిసెప్షన్ ను నాగబాబు హైదరాబాద్ లో నిర్వహించారు.
మెగా ఫ్యామిలీలోకి కోడలి గా అడుగుపెట్టాక మొదటి దీపావళిని అత్తవారింట్లో జరుపుకున్న లావణ్య త్రిపాఠి, భర్త వరుణ్ తేజ్, అత్తమామలు నాగబాబు, పద్మజ, మరదలు నిహారికలతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ అలా అలా చక్కర్లు కొడుతోన్న తరుణంలోనే వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.
లావణ్య త్రిపాఠి తో కలిసి వెకేషన్స్ లో తీసుకున్న బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేస్తూ Happy anniversary to us!♥️ Love you baby.😘 అంటూ భార్య కు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు వరుణ్ తేజ్.
Varun Tej love for Lavanya saying love you baby:
Varun Tej shares 1st wedding pics with wife Lavanya