ByGanesh
Wed 21st Jun 2023 03:45 PM
కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమాల్లో కామెడీ చెయ్యడమే కాదు.. కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోలకి ఫ్రెండ్ కేరెక్టర్స్ తో టాప్ కమెడియన్ గా మారిన వెన్నెలకిషోర్ ని హోస్ట్ గా పెట్టి అలా మొదలయ్యింది అనే గేమ్ షో ని ప్లాన్ చేసారు ఈ టివి వారు. అలీ తో సరదాగా షో ఆగిపోయాక వెన్నెల కిషోర్ ఆట ఈటీవీలో ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం అయ్యేది. టాలీవుడ్ టాప్ జంటలని ఈ షోకి పిలిచి సరదాగా ఆడించేవాడు వెన్నెల కిషోర్.
వెన్నెల కిషోర్.. టాలీవుడ్ లో చాలామంది జంటలని అలామొదలైందిలో ఆట పట్టించాడు. నిఖిల్ ఆయన వైఫ్, మంచు మనోజ్-మౌనిక, రాజశేఖర్-జీవిత, ఆది సాయి కుమార్ జంట, మారుతి జంట, వంశి పైడిపల్లి జంట, శ్రీ రామ్ ఆదిత్య, చందు మొండేటి జంటలు, ఇంకా మధుమిత-శివ బాలాజీ ఇలా సెలెబ్రిటీ జంటల్తో అలా మొదలైంది అంటూ వారి వ్యక్తిగత విషయాలతో పాటుగా.. కెరీర్ విషయాలను పబ్లిక్ తో పంచుకునేలా వెన్నెల కిషోర్ షో సాగింది. ఈ షో బుల్లితెర ప్రేక్షకులకి బాగానే నచ్చింది.
కానీ ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆట ఆగిపోయింది. ఆలా మొదలయ్యింది షో ని ఆపేసి.. మళ్ళీ అలీ తో ఆటాపాటా మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రతి మంగళవారం అలీ హోస్ట్ గా మరో షో మొదలైపోయింది. బుల్లితెర నటులతో అలీ తో ఆల్ ఇన్ వన్ షో నిన్న మంగళవారమే మొదలైంది. అయితే వెన్నెల కిషోర్ షోకి పాపులర్ జంటలైన స్టార్స్ హాజరవుతారని చాలామంది ఎదురు చూసారు. కానీ వెన్నెల కిషోర్ అలా మొదలైంది అలా మధ్యలోనే ముగిసిపోయింది.
Vennela Kishore game is over:
Vennela Kishore Ala Modalaindi Show stopped