UP News: ఎవరూ చూడలేదు కదా అని తన భార్య అందరి ముందూ తిట్టేసి వెళ్లిపోతే.. తల దించుకుని తన పక్కన స్నేహితుడ్ని అడుగుతాడు ఎవరూ చూడలేదు కదా అని. ఆ మిత్రుడు చుట్టూ చూసి.. కోడి పందేలు చూసినట్లుగా చూశారు మావా అని బోరుమంటాడు.. ఇది ఓ సినిమాలో సీన్.
ఇలాంటిదే కానీ.. సింగిల్ క్యారెక్టర్లతో ఓ సీన్ యూపీలో రీక్రియేట్ అయింది. యూపీలోని సంభాల్ అనే ఊళ్లో ఓ కూరగాయల వ్యాపారి తన లాగుడు బండిపై కూరగాయలు పెట్టుకుని వెళ్తున్నాడు. దారిలో రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి తన బండిని లాక్కెళ్లాడు. అయితే ఓ కారు యజమాని తన కారుకు కూరగాయల బండి తగిలిందని.. కేకలేయడం ప్రారంభించాడు. ఆ కూరగాయల బండి యజమాని పట్టించుకోలేదు. మెత్తగా ఉన్నాడని అనుకున్నాడేమో కానీ.. వెంటనే కారు యజమానికి కారు దిగి కూరగాయల వ్యాపారి మీదకు వెళ్లాడు.
संभल -सब्जी बिक्रेता और कार चालक में मारपीट, मारपीट का कारण कार में ठेला लगना
मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल, चंदौसी कोतवाली क्षेत्र का बताया जा रहा वीडियो#Sambhal @sambhalpolice @Uppolice pic.twitter.com/sozEIPGiM3
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) April 9, 2025
అయితే ఆ కూరగాయల వ్యాపారి ఆ వ్యక్తి కారు ఓనర్ అని సందేహించలేదు. నాలుగు కోటింగులు ఇచ్చాడు. చెడామడా కొట్టేసరికి డ్రైవర్ కు సీన్ అర్థమైపోయింది. చుట్టూ ఎవరూ చూడక ముందే నలిగిపోయిన బట్టలు సర్దేసుకుని తప్పుకోవడం మంచిదనుకున్నాడు. కొట్టించుకుని సైలెంట్ గా పక్కకు వెళ్లిపోయాడు. ఆ కూరగాయల వ్యాపారి తన దారిన తాను పోయాడు.
కానీ ఆ కారు యజమానికి తెలియనిదేమిటంటే.. ఎక్కువ మంది చూడకపోయినా ఓ వ్యక్తి కెమెరా కన్ను మాత్రం చూసింది. రికార్డు చేసింది. అంతే ఇప్పుడు ఆ కూరగాయల వ్యాపారి చేతిలో తన్నులు తిన్న వీడియోను దేశవ్యాప్తంగా కోడి పందేలు చూసినట్లుగా చూస్తున్నారు. అతి చూపించి కూరగాయల వ్యాపారితో కొట్టించుకున్న దాని కన్నా.. అందరూ నవ్వుతున్నదే ఆ కారు ఓనర్ కు ఇప్పుడు కాలిపోయేలా చేస్తూంటుంది.
If you don’t work out and drink alcohol 1-2 times in a week. Never fight, in 90% cases you will be beaten badly. If other person looks fit than don’t even shout or argue, he will beat you like a football.
— Dinesh Thakur (@DineshSEM) April 10, 2025
రోడ్లు ఉన్నది పార్క్ చేయడానికి కాదు. అడ్డంగా కారు పార్క్ చేసి.. దానికి చిరు వ్యాపారి బండి తగిలిదిందని రెచ్చిపోతే.. ఇలాంటి ట్రీట్మెంట్లే ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని వ్యాపారులు కాపాడుకుంటారు. ఆత్మగౌరవానికి, ధనిక, పేద తేడా ఉండదు.
మరిన్ని చూడండి