ByGanesh
Wed 12th Jul 2023 10:35 AM
కోలీవుడ్ హీరో విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దమవుతున్నారా.. అంటే నిజమేనేమో అనిపించేలా ఆయన కదలికలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ లో టాప్ రేంజ్ లో పారితోషకం అందుకుంటూ వరస సినిమాలతో జోష్ లో ఉన్న విజయ్ గ్రాఫ్ కోలీవుడ్ సర్కిల్స్ లో బాగా పెరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ లాంటి స్టార్స్ చిత్రాలు వరసగా ఫెయిల్ అవడంతో అటు విజయ్ దూసుకుపోతున్నారు. ఆయన అభిమానులు కూడా ఆయన్ని పాలిటిక్స్ లో చూడాలని క్రేజీగా ఆలోచిస్తూ కనబడుతున్నారు. అయితే కొద్దిరోజులుగా విజయ్ LEO షూట్ తో బిజీగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో ఆయన చేసే పనులు చూసాక ఆయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనిపిస్తుంది.
మొన్నీమధ్యనే విజయ్ పది, పన్నెండు తరగతుల్లో మెరిట్ ర్యాంక్ లు సాధించిన విద్యార్దులు, తల్లితండ్రులతో సమావేశమై వాళ్ళకి బహుమతులు అందజెయ్యడమే కాకూండా.. వారికి ఓటు విలువ తెలిసేలా విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ తర్వాత విజయ్ రాజకీయ ఎంట్రీపై కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో LEO షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హీరో విజయ్ మరోసారి అభిమానులతో కలిసి కూర్చుని చర్చించడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సమావేశంలో విజయ్ తమిళనాడు తాజా రాజకీయాలపై ఆరా తియ్యడమే కాకుండా.. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై అభిమానులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే విజయ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనే అభిప్రాయాలను ఆయన అభిమానుల నుండే వ్యక్తమవుతున్నాయి.
Vijay meets the members of his official fan club:
Tamil actor Vijay meets fans