Virat Kohli turns captain for a bit as he guided skipper Rohit Sharma and set the field during Day 1  | captain Virat Kohli: మళ్లీ కెప్టెన్ అవతారమెత్తిన కోహ్లీ

India vs Australia 2nd Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో డేనైట్ పింక్ టెస్టులో తొలి రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కొంత సేపు సారథిగా అవతారమెత్తి, తాజా కెప్టెన్ రోహిత్ శర్మను గైడ్ చేశారు. అలాగే ఫీల్డింగ్ సెట్ చేయడంతో భారత అభిమానులు ఒక్కసారిగా జోష్ గా ఫీలయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్ వైరలైంది.

సిరాజ్ కు సూచనలిస్తూ..
విరాట్ కెప్టెన్సీ పర్వం ఆసీస్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సాగింది. అప్పటికే తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసిన భారత్ మరో వికెట్ కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న మార్నస్ లబుషేన్, నాథన్ మెక్ స్విన్నీ జోడీని విడదీసేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్ చేయడానికి సిద్ధపడగా, కోహ్లీ సారథ్య బాధ్యతలను తన చేతిలోకి తీసుకున్నాడు. స్లిప్ పొజిషన్ నుంచి నేరుగా మిడాన్ దిశగా పరుగెత్తి, బౌలర్ సిరాజ్ తో సంప్రదింపులు జరిపాడు. బ్యాటర్ కి సంబంధించిని బలహీనతలు చెబుతూ, అందుకు తగిన విధంగా బౌలింగ్ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో కోహ్లీ ఫీల్డులో చాలా ఉత్సాహంగా కనిపించిన క్లిప్పింగ్ ను భారత అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఉత్సాహం కనబరిచారు. 

బ్యాటర్ పైకి కోపంతో బాల్ విసిరిన సిరాజ్..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆటగాళ్ల మధ్య హీట్ రోజురోజుకి వేడుక్కుతోంది. ఇప్పటివరకు స్లెడ్జింగ్ తో ఇరు జట్ల ఆటగాళ్లు కవ్వింపులకు దిగగా, తాజాగా భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కోపంతో బంతిని బ్యాటర్ పైకి విసిరాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో జరిగింది. అప్పటికే రనఫ్ నుంచి బౌలింగ్ వేయడానికి ముందుకు వచ్చిన సిరాజ్, ఆల్మోస్టు బంతిని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈక్రమంలో లబుషేన్ బౌలింగ్ ఆపాలని చేతితో సిరాజ్ ను వారించాడు. దీంతో ఎమోషన్ ఆపుకోలేక పోయిన సిరాజ్.. బంతిని లబుషేన్ వైపు సూటి పెట్టి, వికెట్ల వైపు విసిరాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా కోలాహలం చోటు చేసుకుంది. అయితే సైట్ స్క్రీన్ వద్ద మత్తు పానీయలకు సంబంధిచిన కేసుతో ఒక అభిమాని రాగా, తన ఏకాగ్రత చెదిరిన లబుషేన్.. బౌలర్ ని ఆపినట్లు రిప్లేలో తేలింది. అయితే  సిరాజ్ బంతిని కీపర్ వైపు విసిరిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. భారత అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ బీజీటీలో హీట్ పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. 

ఆధిక్యంలో ఆసీస్..
మరోవైపు రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శనివారం రెండో రోజు డిన్నర్ విరామ సమయానికి నాలుగు వికెట్లకు 191 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓవరాల్ గా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64, 9 ఫోర్లు) అర్థ సెంచరీతో ఎట్టకేలకు లయ దొరకబుచ్చుకున్నాడు. ఓవర్ నైట్ బ్యాటర్ మెక్ స్విన్నీ (39), త్వరగానే పెవిలియన్ కు చేరగా, మాజీ కెప్టెన్, స్టీవ్ స్మిత్ (2) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇక భారత్ కు కొరకరాని కొయ్య అయినటువంటి ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 53 బ్యాటింగ్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వన్డే తరహాతో ఆటతీరుతో భారత బౌలర్లపై మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శించాడు. మిషెల్ మార్ష్ (2 బ్యాటింగ్) తనకు సహకారం అందించాడు. భారత బౌలర్లలో స్పీడ్ స్టర్ జస్ ప్రీత్ బుమ్రాకు మూడు, తెలుగు యువ కెరటం నితీశ్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది. 

Also Read: Ind Vs Aus 2nd Test: సిరాజ్ మియా.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ @ 181.6 కేపీహెచ్.. ఏది నిజం..?

 

మరిన్ని చూడండి

Source link