ByGanesh
Sun 16th Feb 2025 10:01 AM
దమ్కీ తో పాన్ ఇండియా హిట్ కొట్టాలన్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కి ఆ చిత్రం బిగ్ షాకిచ్చింది. దానితో దానికి సీక్వెల్ అన్న విశ్వక్ సేన్ సైలెంట్ అయ్యాడు. ఆతర్వాత గామీ చిత్రంతో ఓకె ఓకె అనిపించినా విశ్వక్ సేన్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాస్త ఊరటనిచ్చింది. కలెక్షన్స్ పరంగా అది విశ్వక్ సేన్ కి నిరాశపరిచే ఫలితాన్నే ఇచ్చింది.
ఆతర్వాత మెకానిక్ రాకి అయినా సక్సెస్ ఇస్తుంది అనుకుంటే.. ఆ చిత్రమూ విశ్వక్ కు పెద్ద షాకే ఇచ్చింది. మెకానిక్ రాకీ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు విశ్వక్ సేన్. కానీ వర్కౌట్ అవ్వలేదు. తాజాగా లైలా అంటూ లేడీ గెటప్ తో వాలంటైన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లైలా చిత్రం పై సోషల్ మీడియాలో కనిపించే కామెంట్స్ చూస్తే విశ్వక్ ఏమైపోతాడో.
లైలా చిత్రానికి క్రిటిక్స్ మాత్రమే కాదు ఆడియన్స్ ఇచ్చిన టాక్ చూస్తే లైలా విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచేలా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైసీపీ కాంట్రావర్సీ కూడా లైలా కు బిగ్ ఓపెనింగ్స్ తేలేకపోయింది. లైలా కంటెంట్ పై వచ్చిన నెగిటివిటి సినిమాను మరింతగా కిల్ చేసేసింది.
లైలా రిజల్ట్ చూసిన అభిమానులు విశ్వక్ మళ్ళీ నిరాశపరిచే సినిమా తెచ్చావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Vishwak again and again:
Vishwak Sen Laila result